పంజాబ్‌కు చెందిన భారతీయ యువతి కెనడాలో హత్యకు గురైంది. ఆమె సహజీనవం చేస్తున్న భారతీయ యువకుడే ఈ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి. పంజాబ్‌లోని సమ్రాలాలకు చెందిన దమన్‌ప్రీత్ కౌర్ (23) అనే యువతి కెనడాలోని ఎడ్మాంటన్ సిటీలో చదువుకుంటోంది.
స్టూడెంట్ వీసా మీద ఉన్న ఆమె అక్కడి సిల్వర్‌బెర్రీ ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉన్నట్లు ఎడ్మాంటన్ పోలీస్ సర్వీస్‌కు సమాచారం అందింది.
జూలై 9న తన నివాసంలో తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆమెను ఎమర్జెన్సీ బృందాలు ఆస్పత్రికి తరలించాయి. అక్కడ చికిత్స పొందుతూ జూలై 12న మరణించింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. ఊపిరాడకుండా చేయడం వల్లే కౌర్ మరణించినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఇది హత్య అని వైద్యులు ధృవీకరించారు.
దీంతో మరింత లోతుగా విచారణ జరిపిన పోలీసులు ఈ నెల 22న రితీష్ కుమార్ (22)అనే భారతీయ యువకుడిని అరెస్టు చేశారు. అతడిపై హత్య కేసు నమోదు చేశారు. అతడు కౌర్‌తో సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడే ఈ హత్య చేశాడని, ఈ ఘటనలో మరో వ్యక్తి ప్రమేయం లేదని పోలీసులు ప్రకటించారు. కౌర్ మృతిపై ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కౌర్ ఐదేళ్లక్రితం ఉన్నత చదువు కోసం కెనడా వెళ్లిందని, ఆమె చదువు కోసం తామెంతో అప్పు చేశామని ఆవేదనగా తెలిపారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబానికి సాయం చేసేందుకు ఒక సంస్థ విరాళాల సేకరణ నిర్వహిస్తోంది. ఇందుకోసం 20,000 డాలర్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 18,000 డాలర్ల వరకు విరాళాలు అందాయి.
కెనడియన్ ఉమెన్స్ ఫౌండేషన్ ప్రకారం, సన్నిహిత భాగస్వామి హింస (దీనిని గృహ హింస లేదా జీవిత భాగస్వామి హింస అని కూడా అంటారు) అనేది ప్రస్తుత లేదా మాజీ భాగస్వామి ద్వారా జరిగే లింగ-ఆధారిత హింసలో ఒక రకం. కెనడాలో సుమారు ప్రతి ఆరు రోజులకు ఒక మహిళ తన సన్నిహిత భాగస్వామి చేతిలో హత్యకు గురవుతోందని ఆ సంస్థ పేర్కొంది.

More Stories
జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి
హెచ్-1బీ వీసాకు లక్ష డాలర్ల ఫీజుపై ట్రంప్‌కు కోర్టులో ఎదురుదెబ్బ