పాకిస్థాన్ సైన్యంపై మరోసారి బలూచిస్థాన్ వేర్పాటువాద గ్రూప్ దాడిచేసింది. పాక్ సైనిక కాన్వాయ్‌పై తాము కొత్తగా ఏర్పాటుచేసిన మహిళా విభాగం దాడిచేసినట్టు బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్) ప్రకటించింది. కరీమా ఆర్మ్‌డ్ అసాల్ట్ డివిజన్ (కాడ్) మొట్టమొదటి ఆపరేషన్ విజయవంతమైందని బీఎల్ఎఫ్ తెలిపింది. ఈ దాడిలో 9 మంది పాకిస్థాన్ సైనికులు హతమయ్యారని పేర్కొంది.
ఈ మేరకు వేర్పాటువాద గ్రూప్ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను రిలీజ్ చేసింది. సాయుధ వాహనంతో సహా పాక్ సైనిక కాన్వాయ్‌పై కాల్పులు జరుపుతున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. సెప్టెంబర్ 22న బలూచిస్థాన్ ప్రావిన్సులో చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) జాతీయ రహదారిపై తుర్బత్‌లో జరిగిన ఒక మిషన్‌కు సంబంధించిన ఫస్ట్-పర్సన్ షాట్‌లను ఈ ఫుటేజ్ చూపిస్తుంది.
ఈ మిషన్‌లో రైఫిల్స్ పట్టుకున్న కాడ్ సాయుధులు క్విక్ రెస్పాన్స్ ఫోర్స్ (క్వ్యూఆర్ఎఫ్) కాన్వాయ్‌పై కాల్పులు జరిపారు. వీడియోలో ఒక మహిళా కమాండర్ మిషన్ గురించి వివరించగా, సాయుధులు కేవలం ఐదు అడుగుల దూరం నుంచే దాడి చేయడం గమనార్హం. సుమారు ఐదు అడుగుల అతిసమీప దూరం నుంచి ఈ దాడి జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది.
ఇది ఆ పోరాటయోధుల శిక్షణ, సన్నద్ధత స్థాయిని తెలియజేయడమే కాకుండా, వారు కొన్నేళ్లుగా కఠినమైన శిక్షణ పొందుతున్నారని సూచిస్తోంది. మహిళా వింగ్ క్రమశిక్షణతో కూడిన దాడులు చేయడాన్ని బట్టి, ఏళ్ల తరబడి పడిన కష్టం, అనుభవంతో బీఎల్ఎఫ్ దీనిని ఒక వ్యవస్థీకృత పోరాట విభాగంగా తీర్చిదిద్దిందని స్పష్టమవుతోంది. అదే సమయంలో, ఈ విభాగం నిరంతరం నిర్వహిస్తున్న ఆపరేషన్లు, ఈ సంస్థ దీనికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తోందో స్పష్టం చేస్తోంది.

More Stories
ఆసియా క్రీడల్లో తెలంగాణ బిడ్డ చికితకు డబుల్ గోల్డ్
అథ్లెటిక్స్‌లో మహిళల రిలే జట్టు పసిడి పరుగు
మయన్మార్ లో వైమానిక దాడిలో 49 మంది మృతి