ఆసియా క్రీడల్లో నిలకడగా రాణిస్తున్న భారత్ ఆటల పదకొండో రోజు అదరగొట్టింది. టీమ్ ఈవెంట్స్‌లో మినహా వ్యక్తిగతంగా ఊరిస్తున్న బంగారు పతకంతో పాటు అథ్లెటిక్స్‌లో మహిళల రిలే జట్టు పసిడి పరుగు పెట్టడంతో ఒకేరోజు దేశానికి రెండు స్వర్ణాలు లభించాయి. ట్రాప్ షూటర్ నీరూ దండా రికార్డు గోల్డ్‌తో సత్తాచాటగా మహిళల 4X400 రిలేలో కిరణ్, పూవమ్మ, ప్రాచి, విథ్య బృందం దుమ్మురేపింది.
మహిళల ట్రాప్ షూటింగ్‌లో నీరూ టీమ్ ఈవెంట్‌లో మనీషా, ఆషిమాతో కలిసి రజతం సాధించింది. అథ్లెటిక్స్‌లో గుల్వీర్ ‘హ్యాట్రిక్’ కొట్టగా హైజంపర్ పూజా సింగ్ కాంస్యం సొంతం చేసుకుంది. వీరితో పాటు 4X400 మెన్స్, 4X100 రిలే మిక్స్‌డ్ ఈవెంట్లలోనూ కంచు మోత మోగించిన భారత్ పతకాల సంఖ్యను హాఫ్ సెంచరీ దాటించింది.
ఆఖరి రోజు మహిళల 4X400 మీ. రిలే టీమ్‌లో కిరణ్, పూవమ్మ, ప్రాచి, విథ్యతో కూడిన బృందం.. 3 నిమిషాల 29.69 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి బంగారు పతకాన్ని గెలుచుకుంది. బహ్రెయిన్ (3:30.21) సిల్వర్ సాధించగా చైనా (3:31.02) కాంస్యం నెగ్గింది. చివరి రేసుకు ముందు భారత్ మూడో స్థానంలో ఉన్నా విథ్య.. చైనా రన్నర్ జు సియూతో పాటు బహ్రెయిన్ స్టార్ సల్వా నసెర్‌ను వెనక్కినెట్టి ప్రథమ స్థానాన నిలవడంలో కీలకపాత్ర పోషించింది.
రన్నర్లు గుల్వీర్ సింగ్, విత్యా రామ్‌రాజ్ ఈ పోటీల అథ్లెటిక్స్‌లో హ్యాట్రిక్ పతకాలతో అదరగొట్టారు. 10000 మీ., 1500 మీ. రేస్‌లో రజతాలు సాధించిన గుల్వీర్.. 5000 మీ. ఈవెంట్‌లో కాంస్యం నెగ్గాడు.. ఇక విత్య 400 మీ. హర్డిల్స్ కాంస్యం, 4×400 రిలేలో స్వర్ణం, 4×400 మిక్స్‌డ్ రిలేలో రజతం సాధించింది. ఒకే క్రీడల ట్రాక్ అండ్ ఫీల్డ్స్‌లో మూడు, అంతకంటే ఎక్కువ పతకాలు సాధించిన వారిలో లవీ పింటో (1951), పీటీ ఉష (5 మెడల్స్-1986), కేఎం బీనామోల్ (2002) ఈ ఫీట్ సాధించారు.
గుల్వీర్ సింగ్ ఆసియా క్రీడల తాజా ఎడిషన్‌లో హ్యాట్రిక్ కొట్టాడు. మంగళవారం అతడు పురుషుల 5 వేల మీటర్ల రేసులో 13 నిమిషాల 32.75 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి కాంస్యం సాధించాడు. ఈ మెగా టోర్నీలో అతడు ఇప్పటికే 1500 మీ., 10వేల మీ. ఈవెంట్స్‌లోనూ రజతాలు నెగ్గాడు. తద్వారా అతడు ఒకే ఎడిషన్‌లో మూడు పతకాలు గెలిచిన రెండో భారత పురుష అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు.
మంగళవారంతో ముగిసిన ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో భారత అథ్లెట్లు అదరగొట్టారు. ఆరు రోజులుగా సాగిన పలు ఈవెంట్లలో ఒక స్వర్ణం, 9 రజతాలు, 14 కాంస్యాలతో మొత్తంగా 24 పతకాలు గెలిచి ఓవరాల్‌గా ఆరో స్థానంతో ముగించారు. చైనా (39), జపాన్ (32), బహ్రెయిన్ (13) టాప్-3లో ఉన్నాయి. మొత్తంగా భారత్.. 52 మెడల్స్‌తో పతకాల పట్టికలో టాప్-10లోకి వచ్చింది.

More Stories
బలోచ్ రెబల్స్ మహిళా వింగ్ దాడిలో 9 మంది పాక్ జవాన్ల మృతి
మయన్మార్ లో వైమానిక దాడిలో 49 మంది మృతి
ఆసియా క్రీడలలో మొదటి వ్యక్తిగత స్వర్ణ పతాక విజేత నీరు ధండా