అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో చీఫ్ ప్రాసిక్యూటర్‌గా చేస్తున్న కరీమ్ ఖాన్ ను తొలగించేందుకు ప్రక్రియ మొదలైంది. పాకిస్థాన్ మూలాలు ఉన్న ఆ ప్రాసిక్యూటర్‌పై లైంగిక వేధింపుల కేసులు నమోదు అయ్యాయి. మరో వైపు ఆయనపై అమెరికా వత్తిడి కూడా పెరుగుతోంది. బ్రిటన్‌కు చెందిన లాయర్ కరీం ఖాన్ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు.
ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూకు అరెస్టు వారెంట్ జారీ చేయాలని 2024లో ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ డిమాండ్ చేశారు. అయితే ఆ కేసులో అమెరికా ఆయనపై వత్తిడి తెస్తున్నట్లు కొందరు భావిస్తున్నారు. వారెంట్ ఇచ్చిన తర్వాత అమెరికా నుంచి ఐసీసీపై వత్తిడి పెరిగినట్లు తెలిసింది.
స్కాట్‌లాండ్‌లోని ఎడన్‌బర్గ్ లో కరీం ఖాన్ జన్మించారు.
లండన్ కింగ్స్ కాలేజీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఐసీసీలో 2021 జూన్‌లో కరీం ఖాన్ చీఫ్ ప్రాసిక్యూటర్‌గా చేరాడు. అంతకుముందే ఆయన పేరొందిన క్రిమినల్ లాయర్. ఎన్నో అంతర్జాతీయ సంస్థల్లో కీలక పాత్రల్లో పని చేశారు. ఉక్రెయిన్, సుడాన్, మయన్మార్, ఇజ్రాయల్-హమస్‌లో జరిగిన యుద్ధ నేరాల కేసులను దర్యాప్తు చేశారు. అయితే జూనియర్ సిబ్బందిని లైంగికంగా వేధించినట్లు కరీం ఖాన్‌పై ఆరోపణలు ఉన్నాయి.
ఐక్యరాజ్యసమితి చేపట్టిన దర్యాప్తులో కరీం వేధింపులు రుజువయ్యాయి. దీంతో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి కరీం ఖాన్‌ను డిస్మస్ చేయాలన్న డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో ఉన్న 125 సభ్య దేశాలు కరీం తొలగింపుపై ఓటింగ్ నిర్వహించనున్నాయి. తన అంగీకారం లేకుండానే వేధింపులకు పాల్పడినట్లు కరీం ఖాన్ ఆఫీసులోని ఓ మహిళా లాయర్ పబ్లిక్‌గా ఫిర్యాదు చేసింది.
2009లో తనను కూడా వేధించినట్లు మరో మహిళ ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న కరీం ఆ ఆరోపణలను కొట్టిపారేశారు. కానీ ఐసీసీలోని సభ్య దేశాలు మాత్రం ఆయన్ను చీఫ్ ప్రాసిక్యూటర్ పోస్టు నుంచి డిస్మస్ చేయాలన్న యోచనలో ఉన్నాయి.
ది అసోసియేటెడ్ ప్రెస్ చూసిన ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రతి ప్రకారం, ఖాన్ తన కార్యాలయంలో, తన ప్రైవేట్ నివాసంలో, ఒక మిషన్‌లో ఉన్నప్పుడు (ఆ సహాయకురాలితో) ఆమె అంగీకారం లేకుండా లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు దర్యాప్తులో ఆధారాలు లభించాయి. అయితే, ఈ పరిశోధనల చట్టపరమైన మూల్యాంకనం కోసం కార్యనిర్వాహక కమిటీ ఎంపిక చేసిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం, ఈ దర్యాప్తు తగినంత నిశ్చయాత్మకంగా లేదని తేల్చింది.

More Stories
బ్రిటన్‌లో తొలి ఏఐ మంత్రిగా భారత సంతతి కనిష్క నారాయణ్
విదేశీ విద్యార్థులు సెప్టెంబర్ 15కు తిరిగి అమెరికా వచ్చేయాలి
ఉక్రెయిన్ ఓడరేవు నౌకపై దాడిలో నలుగురు భారతీయులు మృతి