అయోధ్య ఆలయంలో విరాళాల దుర్వినియోగం కేసు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న వేళ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ భావోద్వేగానికి గురయ్యారు. రామ మందిర ట్రస్ట్ వ్యవహారాలకు వీహెచ్‌పీని బాధ్యులను చేయడం సరికాదంటూ ఆయన స్పష్టం చేశారు. వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్, కేంద్ర ప్రభుత్వంతో ఈ వివాదాన్ని ముడిపెడితే ఒప్పుకోమని ఆయన ఒక ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు.
అలాగని ఈ ఘటనను సమర్థించే ప్రయత్నం కూడా చేయబోమని స్పష్టం చేశారు. “ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరం. మాకు కూడా ఎంతో బాధ కలిగింది. అయితే, జరిగిన దాన్ని సమర్థించే ప్రయత్నం చేయము, సాకులు చెప్పే ప్రశ్నే లేదు” అని తెలిపారు.
విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు చంపత్ రాయ్ శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తుండటంతో ఆ అంశం కూడా ఇంటర్వ్యూలో ప్రస్తావనకు వచ్చింది.
విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు చంపత్ రాయ్ శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తుండటంతో ఆ అంశం కూడా ఇంటర్వ్యూలో ప్రస్తావనకు వచ్చింది.
చంపత్ రాయ్‌కి ట్రస్ట్‌లో బాధ్యతలు ఇవ్వడంలో వీహెచ్‌పీకి ఎలాంటి పాత్ర లేదంటూ అలోక్ కమార్ స్పష్టం చేశారు. “చంపత్ రాయ్ వీహెచ్‌పీలో సీనియర్ నాయకుడు, ప్రస్తుతం అంతర్జాతీయ ఉపాధ్యక్షుడే. కానీ ట్రస్ట్‌లో ఆయనను మేము నియమించలేదు. మేము సిఫార్సు కూడా చేయలేదు. అక్కడ వీహెచ్‌పీకి ప్రాతినిధ్యం వహించడం లేదు” అని చెప్పారు.
చంపత్ రాయ్‌పై ఇప్పటి వరకు వీహెచ్‌పీ కానీ, పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అలోక్ కుమార్ స్పష్టత ఇచ్చారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ఈ విరాళాల పక్కదారి వ్యవహారంలో ఇప్పటి వరకు చంపత్ రాయ్ దోపిడీకి పాల్పడ్డారని, కుట్ర చేశారని ఎవ్వరూ ఆరోపించడం లేదని గుర్తు చేశారు. అయితే, ఈ కేసులో దోషులు ఎవ్వరైనా సరే కఠిన చర్యలు మాత్రం తప్పవని చెప్పారు.
హిందూ సమాజం మనోభావాలు దెబ్బతీసిన ఈ వ్యవహారంలో నిందితులకు కఠిన శిక్షలు పడాలంటూ అలోక్ కుమార్ డిమాండ్ చేశారు. పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి సీనియర్ అధికారులతో దర్యాప్తు చేయించాలని కోరారు. అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో రోజువారీ విచారణ చేసి, నాలుగైదు నెలల్లోనే దోషులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు.
దోషులు జైలుకు వెళ్లడం హిందూ సమాజం చూడాలని, అప్పుడు మాత్రమే న్యాయం జరిగినట్టని చెప్పారు. అయితే, రామ మందిరం బాధ్యత మాత్రం ట్రస్ట్‌దే అని, దాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చారు.
ఈ వివాదానికి ఉన్న రాజకీయ సున్నితత్వాన్ని గుర్తించిన అలోక్ కుమార్, ఎన్నికల సంవత్సరంలో ఈ అంశం ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. “ఇది ఎన్నికల సంవత్సరం. రామమందిర వివాదం కచ్చితంగా ప్రభావం చూపగలదు. కానీ అంతిమంగా, ఎక్కడ నిజాయితీ ఉందో, ఎక్కడ కపటం ఉందో శ్రీరాముడికి తెలుసు,” అని చెప్పారు.
కాగా, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ మాట్లాడుతూ, ట్రస్ట్ ఆర్థిక విధానాలు పారదర్శకంగా ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే, ఈ వ్యవహారంపై జరుగుతున్న సిట్ విచారణకు ఆయన మద్దతు తెలిపారు. ఒక బహిరంగ ప్రకటనలో, చోరీకి సంబంధించిన ఆరోపణలు శ్రీరామ భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని, అవి “తీవ్ర వేదన కలిగించేవి” అని గిరి పేర్కొన్నారు. దీనికి బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెట్టాలని, తప్పు చేసిన వారిని ఏమాత్రం వదలకూడదని ఆయన స్పష్టం చేశారు.

More Stories
ఇజ్రాయెల్‌కు అమెరికానే కాదు… భారత్ కూడా మిత్రదేశం
శ్యామా ప్రసాద్ ముఖర్జీ గ్రంధాన్ని నిషేధించిన బ్రిటిష్ రాజ్
ఉత్తరప్రదేశ్‌లో వరుసగా మూడోసారి `భారీ మెజారిటీ’తో అధికారం!