ఇజ్రాయెల్ తన ‘ఏకైక శక్తివంతమైన మిత్రదేశం’ అయిన అమెరికాను విమర్శించడం మానుకోవాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యను తిప్పికొడుతూ, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు భారతదేశాన్ని ఇజ్రాయెల్‌కు బలమైన మద్దతుదారులలో ఒకటిగా పేర్కొన్నారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, ఇజ్రాయెల్‌కు భారతదేశం నుండి ‘అపారమైన’ మద్దతు లభిస్తోందని నెతన్యాహు తెలిపారు.
“నేను జేడీ వాన్స్‌ను గౌరవిస్తాన. మాకు చాలా మంచి సంబంధం ఉంది. కానీ ఆయన చెప్పే ప్రతిదానితో నేను ఏకీభవిస్తానని దీని అర్థం కాదు. వైట్ హౌస్‌లో మాకు లభించిన గొప్ప స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్. ఆ మాటకు నేను పూర్తిగా కట్టుబడి ఉంటాను,” అని ఆయన పేర్కొన్నారు.
“భారతదేశం చిన్నాదేశమేమీ కాదు. ఆ దేశం లాంటి మరికొంతమంది స్నేహితులు మాకు ఉన్నారు. మీకు తెలుసు, అక్కడ 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. నిజంగా అక్కడ మాకు అపారమైన మద్దతు ఉంది. మీకు తెలుసా, నాకు ఈ ఫేస్‌బుక్ ఖాతా ఉంది, అక్కడి అపారమైన మద్దతుతో నేను మునిగిపోతూ ఉంటాను,” అని ఆయన తెలిపారు.
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చలను, కుదురుతున్న ఒప్పందాలను ఇజ్రాయెల్ నాయకులు తీవ్రంగా విమర్శించడాన్ని తప్పుపట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విదేశాంగ విధాన నిర్ణయాలపై ఇజ్రాయెల్ అసంతృప్తి వ్యక్తం చేయడం వాన్స్‌కు నచ్చలేదు. ఈ క్రమంలోనే ఆయన ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి కీలక వాఖ్యలు చేశారు.
“నేను ఇజ్రాయెల్ కేబినెట్‌లో మంత్రిగా ఉంటే ఈ ప్రపంచంలో నాకు మిగిలి ఉన్న ఏకైక ఏకైక శక్తివంతమైన, పెద్ద మిత్రదేశమైన అమెరికాపై విమర్శలు చేసేవాడిని కాదు” అని జేడీ వాన్స్ చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో నెతన్యాహును ప్రశ్నించగా ఆయన సమాధానం ఇచ్చారు. సోషల్ మీడియా, అంతర్జాతీయ మీడియాలోని కొన్ని వర్గాల నుండి విమర్శలు ఎదురవుతున్నప్పటికీ, ఇజ్రాయెల్‌కు అనేక ఇతర దేశాల మద్దతు ఉందని నెతన్యాహు నొక్కి చెప్పారు.
“చాలా మంది నాయకులు నాకు ఫోన్ చేసి ఇలా అంటారు: ‘చూడండి, ప్రజాభిప్రాయం విషయంలో నాకు కొంత ఇబ్బంది ఉంది, కానీ మీకు మా గౌరవం ఉందని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మనం కొన్ని ఒప్పందాలు చేసుకోగలమా? మీ సైన్యం అనుసరించే పద్ధతులను మాకు నేర్పించగలరా? అలాగే మీ ఏఐ, సైబర్ రంగ నైపుణ్యాన్ని మాకు అందించగలరా?'” అని నెతన్యాహు పేర్కొన్నారు.
సాంకేతిక రంగంలో ఇజ్రాయెల్ ప్రపంచ అగ్రగామిగా కొనసాగుతోందని ఆయన తెలిపారు. “సైబర్ రంగంలో ప్రపంచంలోనే ఇజ్రాయెల్ రెండో స్థానంలో ఉందని, మా సాంకేతికత అత్యుత్తమంగా ఉందని మీకు తెలుసు. కాబట్టి, పరిస్థితులు పైకి కనిపించేలా ఉండవు. మాకు చాలా మంది మిత్రులు ఉన్నారు,” అని ఆయన స్పష్టం చేశారు.

More Stories
అయోధ్యతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి
శ్యామా ప్రసాద్ ముఖర్జీ గ్రంధాన్ని నిషేధించిన బ్రిటిష్ రాజ్
ఉత్తరప్రదేశ్‌లో వరుసగా మూడోసారి `భారీ మెజారిటీ’తో అధికారం!