ఒక ప్రజాప్రతినిధిగా, న్యాయ సంబంధిత అంశాలపై పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా, పాస్‌పోర్ట్, పౌరసత్వం మధ్య చట్టపరమైన స్పష్టమైన తేడాను ఒవైసీ తెలుసుకోవాలని హితవు చెప్పారు. ఆయన వ్యాఖ్యలు చట్టంపై పూర్తి అవగాహన లేకపోయి ఉండొచ్చని, లేదంటే రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో కావాలనే గందరగోళాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారని అర్థమవుతోందని ధ్వజమెత్తారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ (చెప్పిన వివరణ ప్రకారం భారతీయ పాస్‌పోర్ట్ కు విలువలేదని అర్థం కాదని, పాస్‌పోర్ట్ ఒక్కటే భారతీయ పౌరసత్వాన్ని నిర్ధారించే ఆధారం కాదని మాత్రమే విదేశాంగ శాఖ చెప్పిందని కిషన్ రెడ్డి తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం, పౌరసత్వ చట్టం-1955 ప్రకారం భారతదేశంలో పౌరసత్వం నిర్ణయించబడుతుందని, ఏదో ఒక అడ్మినిస్ట్రేటివ్ డాక్యుమెంట్ ఆధారంగా పౌరసత్వాన్ని నిర్ణయించరని స్పష్టం చేశారు.
పాస్‌పోర్ట్ ను విదేశాలకు వెళ్లేవారు ఓ ట్రావెల్ డాక్యుమెంట్ గా మాత్రమే వినియోగించాలని స్పష్టంగా చట్టంలో పేర్కొన్నారని చెప్పారు. పాస్‌పోర్ట్స్ చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం, ప్రజాహితాన్ని దృష్టిలోపెట్టుకుని. భారత పౌరుడు కాని వ్యక్తికి కూడా కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ జారీ చేసే అధికారం ఉందని తెలిపారు.. కాబట్టి, చట్టంలోని అంశాలను జాగ్రత్తగా గమనిస్తే పాస్‌పోర్ట్‌ను పౌరసత్వాన్ని నిర్ధారించే ఆధారంగా పరిగణించలేమని తేల్చి చెప్పారు.
ఇది మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధన కాదని, పాస్‌పోర్ట్స్ చట్టం – 1967లో, కాంగ్రెస్ పాలనలోనే అమలులోకి వచ్చిందని తెలిపారు. భారతీయ న్యాయస్థానాలు కూడా పాస్‌పోర్ట్ ఒక్కటే పౌరసత్వానికి తుది ఆధారం కాదని పలు సందర్భాల్లో పునరుద్ఘాటించాయని గుర్తు చేశారు. పాస్‌పోర్ట్ కలిగి ఉండటం ఒక్కటే.. పౌరసత్వ చట్టంలోని నిబంధనలను పూర్తిచేసినట్లు కాదని 2013లో బొంబాయి హైకోర్టు కూడా స్పష్టంగా పేర్కొందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.
అందువల్ల, ఒవైసీతోపాటుగా ప్రజలంతా అర్థం చేసుకోవాల్సిన విషయం మోదీ ప్రభుత్వమో లేదా విదేశాంగ మంత్రిత్వ శాఖనో కొత్త నిబంధనను తీసుకురాలేదని తెలిపారు. పౌరసత్వం అనేది రాజ్యాంగం ప్రకారం, పౌరసత్వ చట్టం ప్రకారం సంక్రమిస్తుందని తెలుసుకోవాలని, కేవలం ఒక పత్రం పౌరసత్వం నిర్ధారించ బడదని స్పష్టం చేశారు.

More Stories
నిరంతర ప్రజా ఉద్యమాలతో నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించాలి
‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ను తక్షణమే అమలు చేయాలి
ధరణి లావాదేవీలపై విచారణకు సిట్