వ‌న్డే బ్యాట‌ర్ల‌లో గిల్‌కు రెండో ర్యాంక్‌

వ‌న్డే బ్యాట‌ర్ల‌లో గిల్‌కు రెండో ర్యాంక్‌
ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో స్థానంలో నిలిచాడు. ఇక టెస్టు బౌలింగ్ ర్యాంకుల్లో టాప్ ప్లేస్‌లో ఉన్న జ‌స్ప్రీత్ బుమ్రాకు స‌మంగా  న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ వ‌చ్చేశాడు. ఆ ఇద్ద‌రూ ఇప్పుడూ టెస్టు బౌలింగ్ ర్యాంక్‌లో స‌మంగా ఉన్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 11 వికెట్లతో చెలరేగి కివీస్ 253 పరుగుల భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 
కివీస్ క్రికెట్ చరిత్రలో జాక్ కౌవీ, రిచర్డ్ హాడ్లీల తర్వాత 36 ఏళ్లకు టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంకు సాధించిన మూడో ఫాస్ట్ బౌలర్‌గా 34 ఏళ్ల మ్యాట్ హెన్రీ అరుదైన ఘనత సాధించాడు. ఇక వ‌న్డే బ్యాటింగ్‌లో కివీస్ బ్యాట‌ర్ డారెల్ మిచెల్ తొలి స్థానంలో ఉన్నాడు. అఫ్గానిస్థాన్‌తో ఇటీవల ముగిసిన మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన గిల్ బ్యాటింగ్ విభాగంలో ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. 
 
ఈ సిరీస్‌లోని తొలి రెండు వన్డేల్లో గిల్ 84, 154 పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ప్రస్తుతం నంబర్ 1 స్థానంలో ఉన్న న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్ కంటే గిల్ కేవలం 24 రేటింగ్ పాయింట్ల వెనుకంజలో ఉన్నాడు. మరోవైపు, తొడకండరాల గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమైన విరాట్ కోహ్లీ ఒక స్థానం దిగజారి మూడో ర్యాంకుకు పడిపోగా, రోహిత్ శర్మ నాలుగో స్థానంలోనే కొనసాగుతున్నాడు.
టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ 21 స్థానాలు దూసుకెళ్లి 43వ ర్యాంకు సాధించగా, శ్రేయస్ అయ్యర్ 14వ స్థానానికి చేరాడు. కేఎల్ రాహుల్ రెండు స్థానాలు కోల్పోయి 11వ స్థానానికి పరిమితమయ్యాడు. బౌలింగ్‌ విభాగంలోనూ టీమిండియా యువ బౌలర్లు సైతం సత్తాచాటారు. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 16 స్థానాలు మెరుగుపరుచుకుని 22వ ర్యాంకుకు చేరగా, ప్రసిద్ధ్ కృష్ణ ఏకంగా 34 స్థానాలు ఎగబాకి 58వ ర్యాంకును దక్కించుకున్నాడు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ 71వ స్థానంలో నిలిచాడు.