ఇరాన్‌తో యుద్ధానికి కాంగ్రెస్ ముందస్తు అనుమతి లేకుండా అమెరికా దళాలను పంపడాన్ని నిరోధిస్తూ, అలాగే ప్రస్తుతం నెలకొన్ని ఉద్రిక్తతల నుంచి యూఎస్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సెనెట్ ఒక ఉమ్మడి తీర్మానాన్ని ఆమోదించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగి, అది తీవ్రస్థాయి యుద్ధానికి దారితీయవచ్చనే ఆందోళనల నేపథ్యంలో కాంగ్రెస్ ఈ అడుగు వేసింది.
అనవసరమైన యుద్ధంలో అమెరికా తీవ్రంగా నష్టపోతుందనే కారణంతోనే ట్రంప్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ తీర్మానానికి 50 -48 ఓట్లతో మద్దతు లభించింది. ఈ నెల ప్రారంభంలో ప్రతినిధుల సభ కూడా ఆమోదించింది. దాంతో 1973లో అమల్లోకి వచ్చిన వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం యుద్ధంలో ఉన్న అమెరికా బలగాలను వెనక్కి పిలవాలని అధ్యక్షుడిని కోరుతూ కాంగ్రెస్ రెండు సభలు ఆమోదించిన తొలి తీర్మానంగా ఇది నిలవడం విశేషం.
అమెరికా – ఇరాన్ మధ్య ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైంది. సుమారు వంద రోజులకు పైగా సాగిన ఈ యుద్ధం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చింది. అదేవిధంగా కొందరు రిపబ్లికన్ సభ్యులు కూడా ఆందోళన చేపట్టడంతో తీర్మానానికి మద్దతు లభించింది. డెమోక్రాట్లలో ఒకరు మినహాయించి మిగతా సభ్యులంతా తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. నలుగురు రిపబ్లికన్ సభ్యులు కూడా వారికి మద్దతు ఇచ్చారు. ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు ఓటింగ్‌లో పాల్గొనలేదు.
యుద్ధాన్ని ఆపేయాలంటూ చేసిన ఈ తీర్మానం ట్రంప్ సంతకం కోసం వైట్ హౌస్‌కు మాత్రం వెళ్లదు. ఎందుకంటే వైట్‌హైస్ సెనేటర్లు చేసిన ఈ తీర్మానం రాజ్యంగబద్ధం కాదని, తమపై ఇది బలవంతంగా అమలు కాదంటూ స్పష్టం చేసింది. దాంతో ఈ అంశం కోర్టులో తేలే అవకాశం ఉంది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో కూడా ఈ తీర్మానం 215 – 208 ఓట్లతో ఆమోదం పొందింది.
అక్కడ కూడా నలుగురు రిపబ్లికన్ సభ్యులు డెమోక్రాట్లతో కలిసి మద్దతు తెలిపారు. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌తో శాంతి ఒప్పందం కోసం చర్చలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌తో యుద్ధం దాదాపు ముగిసేపోయే పరిస్థితి ఉందనే చెప్పొచ్చు. సొంత పార్టీ వారే తనకు వ్యతిరేకంగా ఓటు వేయడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా స్పందిస్తూ, ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చిన ప్రజాప్రతినిధులను తీవ్ర పదజాలంతో దూషించారు. వారిని ప్రచారం కోసం ఆరాటపడేవారుగా అభివర్ణించారు. ఇలా చర్యలకు దేశభక్తి లేనివి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Stories
వెనెజువెలా, జపాన్ లను వణికించిన భారీ భూకంపాలు
భారత్- దక్షిణ కొరియా సహకారం బలోపేతం చేసుకోవాలి
ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీకి ఆహ్వానం