ఎంఐఎం పార్టీకి చెందిన వారు, ముస్లింలు చిన్నపిల్లలను, అమ్మాయిలను రకరకాలుగా టార్గెట్ చేసి లవ్ జిహాద్ పేరుతో లేదా చిన్నారులను సైతం వదలకుండా ఇలాంటి లైంగిక దాడులకు, అఘాయిత్యాలకు తెగబడుతున్నారని బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డా. శిల్పారెడ్డి తీవ్ర ఆగ్రహం. వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలో అమానుష అఘాయిత్యంతో హత్యాయత్నంకు పాల్పడి, నిమ్స్ లో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను బిజెపి ప్రతినిధివర్గంతో కలిసి పరామర్శించిన ఆమె కేవలం హిందూ పిల్లలను, హిందూ మహిళలనే టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిందితుడు గౌస్ కు ఇప్పటికే రౌడీషీటర్ అనే పేరుందని, గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయని ఆమె గుర్తు చేశారు.
పరామర్శించిన బిజెపి బృందంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్. గౌతమ్ రావు, రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు కూడా ఉన్నారు. అంతటి నేర చరిత్ర ఉన్న క్రిమినల్పై ముందే యాక్షన్ తీసుకోకుండా పోలీసులు, ప్రభుత్వం ఇలా చోద్యం చూస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూలీ పనులు చేసుకునే బాధిత బాలిక తల్లి ఆసుపత్రి వద్ద తీవ్ర వేదనకు గురవుతోందని, స్పైనల్ ఇంజురీ (వెన్నెముక దెబ్బతినడం) వల్ల ఆ బాలిక లేవలేని పరిస్థితిలో పడివుందని ఆమె ఆవేదన చెందారు. మరోవైపు తెలంగాణలో రోజుకు 5 పోక్సో కేసులు రికార్డవుతున్నాయని, 2025 నుంచి ఇప్పటివరకు 563 పోక్సో కేసులు నమోదయ్యాయని ఆమె గణాంకాలను ప్రస్తావించారు. దేశంలో మొత్తం 9 శాతం పోక్సో కేసులు నమోదైతే, కేవలం కాంగ్రెస్ పాలనలోని తెలంగాణలోనే 15 శాతం కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.
మొన్నటిదాకా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల పట్ల దొంగ ధర్నాలు, నిరసనలు చేస్తూ, టీవీ డిబేట్లలో చర్చలకు వెళ్లి దుమ్మెత్తిపోసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఎందుకు నోరు మూసుకున్నారని ఆమె నిలదీశారు. అలాగే అధికార కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాలను శిల్పారెడ్డి తీవ్రంగా ఖండించారు. మొన్న మంత్రి సీతక్క వచ్చి కేవలం పరామర్శించి వెళ్లారే తప్ప, అసలు ఇటువంటి ఘటనలపై రివ్యూ చేశారా అంటే లేదని ఆమె మండిపడ్డారు.
ఇట్లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు, నిర్ణయాలు తీసుకోవాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా అయినా నిందితుడికి వేగవంతంగా శిక్షపడేలా చూడాలని డా. శిల్పారెడ్డి డిమాండ్ చేశారు. దాంతో పాటు, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న బాధిత బాలిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని ఆమె స్పష్టం చేశారు.

More Stories
ఎస్ఐఆర్ ప్రక్రియపై బురదజల్లుతున్న కాంగ్రెస్, బిఆర్ఎస్
వివాహ బంధంకు వెనుకడుగు వేస్తున్న తెలుగు యువత
సింగరేణిలో రూ 1,600 కోట్ల బొగ్గు అదృశ్యంపై దర్యాప్తు జరపండి