తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న తిరుగుబాటుతో పార్లమెంటులో ఎన్డీయే సీట్లు పెరిగి ఉభయ సభల్లోనూ మూడింట రెండు వంతుల మెజారిటీకి దగ్గరైంది. దీంతో కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను కూడా సులువుగా ఆమోదించుకొనే అవకాశం ఉంది. లోక్‌సభలో మాత్రం 2/3 మెజారిటీకి 363 సీట్లు అవసరం కాగా టీఎంసీ ఎంపీలు 20 మంది మద్దతు ఇచ్చినా ఎన్డీయే బలం 313 సీట్లకే చేరుతుంది. అయినప్పటికీ, లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి అవసరమైన 363 మార్కును చేరుకోవడానికి ఎన్డీఏ దూరంలో ఉంటుంది.
ఇక రాజ్యసభలో ఎన్డీయేకి 148 మంది ఎంపీల బలం ఉండగా, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతోన్న జార్ఖండ్, మిజోరాంలలో మూడు సీట్లు దక్కే అవకాశం ఉంది. అలాగే బెంగాల్‌లో ముగ్గురు టీఎంసీ ఎంపీలు రాజీనామా చేయనుండడంతో ఉప ఎన్నికల్లో ఆ సీట్లనూ దక్కించుకోనుంది. దీంతో రాజ్యసభలో ఎన్డీయే బలం 154 సీట్లకు చేరుతుంది. అయితే 2/3 మెజారిటీకి ఇంకా 9 సీట్లు తగ్గుతాయి.
టీఎంసీ ఎంపీల్లో పలువురు రాజీనామా చేసే పరిస్థితి ఉండడంతో ఎన్డీయే రాజ్యసభలో 2/3 మెజారిటీకి చేరుకుంటుందని పరిశీలకుల అంచనా. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 మంది ఎంపీల పదవీ కాలం రానున్న నవంబరుతో పూర్తికానుండడంతో రాజ్యసభలో పాలకపక్షం బలం తగ్గే పరిస్థితీ ఉంది. గత యూపీ అసెంబ్లీలో సమాజ్‌వాదీ పార్టీకి బలం పెరగడం వల్ల అక్కడ కొన్ని స్థానాలను ఎన్డీఏ కోల్పోయే ప్రమాదం ఉంది.
మరోవైపు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి బలం క్రమంగా క్షీణిస్తోంది. డీఎంకేకు చెందిన 8 మంది, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు కూటమికి దూరం కావడంతో ప్రస్తుతం ‘ఇండియా’ కూటమి బలం రాజ్యసభలో 64కి పడిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్‌కు 7 సీట్లు ఉండగా, బిజూ జనతా దళ్‌కు 6 సీట్లు ఉన్నాయి. ఎండీఎంకే వంటి స్వతంత్ర పార్టీలు బిల్లుల ఆధారంగా ఎటువైపు అయినా మొగ్గు చూపే అవకాశం ఉంది.

More Stories
పరిశీలనలో పదహారేళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!
దేశంలోనే తొలి డెంగ్యూ వ్యాక్సిన్‌కు కేంద్రం ఆమోదం
జమ్ముకశ్మీర్‌లో వరద బీభత్సం…17 మంది మృతి