దేశ రాజధాని ఢిల్లీలోని ఒక రెస్టారెంట్‌లో బధవారం ఉదయం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 21మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో పది మంది విదేశీయులు ఉన్నట్లు నిర్ధారించారు. వారిలో ఎక్కువ శాతం మంది సెంట్రల్ ఏషియా, ఆఫ్రికా దేశస్థులు ఉన్నారు. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం ఢిల్లీ, మాల్వియ నగర్‌లోని లెమన్ గ్రీన్ అనే రెస్టారెంట్‌లో ఉదయం 9.45 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది.
రెస్టారెంట్ బేస్‌మెంట్‌లో మొదలైన మంటలు తర్వాత పై అంతస్తుల వరకు వ్యాపించాయి. మికాసా ఇన్‌కు చెందిన రెస్టారెంట్‌లో మొదలైన మంటలు ఆ తర్వాత పైకి వ్యాపించాయి. ఆ బిల్డింగ్ అయిదు అంతస్తులు ఉన్నది. మంటలు, పొగ దట్టంగా కమ్ముకున్న సమయంలో ఓ మహిళ ఆ హోటల్ పైనుంచి కిందకు దూకింది. ఆ బిల్డింగ్ నుంచి ఇద్దరు మహిళలు దూకినట్లు తెలుస్తోంది.
ఆ మహిళలను స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. బిల్డింగ్ వద్ద మాట్రిసెస్ ఏర్పాటు చేశారు. ఆ పరుపు బెడ్‌లపై ఓ మహిళ దూకిన విజువల్స్ చిక్కాయి. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఆ హోటల్‌లో సుమారు 25 గదులు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 40 మంది అతిథులు అందులో ఉన్నట్లు తెలిసింది. దీంట్లో ఎక్కువ మంది వైద్య చికిత్స కోసం వచ్చిన విదేశీయులు ఉన్నారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది గెస్ట్‌లు నిద్రలో ఉన్నట్లు భావిస్తున్నారు.
అందులో అగ్నిప్రమాదం మొదలైన బేస్‌మెంట్‌లో చిక్కుకున్న పలువురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
“అగ్నిప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ప్రమాద బాధితులకు అధికారులు సాధ్యమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాం. అలాగే, గాయపడిన వారికి రూ.50,000 ప్రకటించాం” అని మోదీ పేర్కొన్నారు.

More Stories
విజయవంతంగా రుద్రమ్-2 క్షిపణి ప్రయోగం
గడువుకు ముందే వీసా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి
రేపే కేరళలోకి నైరుతి రుతుపవనాలు