ప్రధాని స్పందన తర్వాత కొద్ది నిమిషాల్లోనే ఆ వార్త సంస్థ క్షమాపణలు తెలిపింది. ఆ కథనం సరైనది కాదని పేర్కొంటూ దానిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ‘విదేశీ ప్రయాణాలపై పన్ను, సెస్ విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్న మా కథనం సరికాదు. ఆ కథనాన్ని ఉపసంహరించుకుంటున్నాం. జరిగిన తప్పిదానికి చింతిస్తున్నాం’ అని ఆ సంస్థ పేర్కొంది.
ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ సీఎన్‌బీసీ-టీవీ18 శుక్రవారం ఈ కధనాన్ని తెలిపింది. విదేశీ ప్రయాణాలపై విధించే పన్ను/సెస్సు/సర్‌చార్జీ నేరుగా కేంద్రానికే చెందుతుందని, విభజించదగిన నిధిగా కాదని సంబంధిత వర్గాలు వెల్లడించాయని పేర్కొన్నది. ఈ ప్రతిపాదనపై అత్యున్నత స్థాయిలో చర్చ జరుగుతున్నట్లు వారు చెప్పారని, విదేశీ ప్రయాణాలపై విధించే పన్ను/సెస్సు/సర్‌చార్జీ తాత్కాలికంగా ఏడాది పాటు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారని వివరించింది.
అమెరికా-ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో పెరిగిన ముడి చమురు ఖర్చులను తగ్గించడానికి ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు వారు చెప్పారని తెలిపింది. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించలేదని కూడా కథనం పేర్కొంది.

More Stories
తృణమూల్ బ్యాంకు ఖాతాల్లో రూ 440 కోట్లు జప్తు
అదానీ షాపుల్లో నికోటిన్ పౌచ్‌ల అమ్మకంపై దుమారం
భారీ నష్టాల్లోకి స్టాక్‌మార్కెట్లు.. రూ 8 లక్షల కోట్లు ఆవిరి