కేజ్రీవాల్‌పై కోర్టు ధిక్కార చర్యలకు సిద్ధమైన ఢిల్లీ హైకోర్టు

కేజ్రీవాల్‌పై కోర్టు ధిక్కార చర్యలకు సిద్ధమైన ఢిల్లీ హైకోర్టు

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. సెక్షన్ 2సీ ప్రకారం కేజ్రీవాల్‌పై కోర్టు ధిక్కార క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు చర్యలు ప్రారంభించింది.  తనపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆప్ నేతలపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఆప్ అగ్రనేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా పలువురు నేతలపై క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించింది. ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్, నేత దుర్గేష్ పాఠక్ ఇతర నేతలు కోర్టు ధిక్కార చర్యలు ఎదుర్కోబోతున్నారు. ఈ మేరకు జస్టిస్ స్వర్ణకాంత శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఆప్ నేతల ప్రవర్తనను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడటానికి చట్టపరమైన మార్గాలను అనుసరించాల్సింది పోయి కేజ్రీవాల్, ఆయన బృందం తనపై సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తన ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ పోస్టులు ఉన్నాయని ఆమె ఆరోపించారు. 

తాను ఒక రాజకీయ పార్టీ పట్ల విధేయత ఉన్నానంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ఆమె తీవ్రంగా పరిగణించారు. న్యాయమూర్తులకు రాజకీయ రంగు పులమడం ద్వారా న్యాయవ్యవస్థ స్థాయిని ప్రజల్లో తగ్గించే ప్రయత్నం చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాను ఒక విద్యాసంస్థలో చేసిన ఉపన్యాసానికి సంబంధించిన వీడియోను ఉద్దేశపూర్వకంగా ఎడిట్ చేశారని, ఆ సమయంలో మాట్లాడిన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరిస్తూ ప్రచారం చేశారని జస్టిస్ స్వర్ణకాంత ఆరోపించారు. ‘

ఒక న్యాయమూర్తి వ్యక్తిగత, వృత్తిపరమైన గౌరవాన్ని భంగపరిచే విధంగా ఈ చర్యలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో న్యాయస్థానం గౌరవాన్ని తగ్గించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించలేదని జస్టిస్ స్వర్ణకాంత శర్మ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  అరవింద్ కేజ్రీవాల్ తనపై ఉన్న కేసుల్లో చట్టపరమైన పోరాటం చేయకుండా, న్యాయమూర్తి ప్రతిష్టను నాశనం చేయడానికి ప్రయత్నించారని ఆమె ఆరోపించారు.

ఆప్ నేతలపై తానే స్వయంగా వారిపై ధిక్కార చర్యలు ప్రారంభించినందున, ఈ కేసును తాను విచారించడం సమంజసం కాదని భావించిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. మద్యం కేసులో సీబీఐ తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా న్యాయమూర్తి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడటంలో ఇలాంటి నిర్ణయాలు అత్యవసరమని ఆయన వ్యాఖ్యానించారు.

న్యాయమూర్తి శర్మ పక్షపాతంతో ఉన్నారని కేజ్రీవాల్ చేసిన ఆరోపణల నేపథ్యంలో, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు విచారణ నుంచి తప్పుకోవడానికి ఆమె నిరాకరించారు. ఆప్ ఇతరులతో చర్చలు జరిపి, చివరికి విచారణలకు హాజరుకాకూడదని నిర్ణయించుకుంది. విచారణ నుంచి తప్పుకోవాలన్న పిటిషన్‌పై తీర్పు వెలువడిన తర్వాత, న్యాయమూర్తి స్వరన్ కాంత శర్మ నుంచి తనకు న్యాయం జరుగుతుందన్న ఆశలు వమ్ము కావడంతో, తాను కోర్టు విచారణలను ఎందుకు బహిష్కరించాలని నిర్ణయించుకున్నానో వివరిస్తూ, కేజ్రీవాల్ ఏప్రిల్ 27న ఎక్స్ లో ఒక వీడియోను పోస్ట్ చేశారు.