* బెంగళూరులో ప్రధాని సభకు సమీపంలో జిలెటిన్ స్టిక్స్ కలకలం..!
“ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న పరిస్థితిని ఒకసారి గమనించండి. 25- 30 ఏళ్ల పాటు కాంగ్రెస్, డీఎంకేతో సన్నిహిత సంబంధాలను పంచుకుంది. డీఎంకేతో పొత్తు పెట్టుకోవడం వల్ల పదే పదే కాంగ్రెస్ సంక్షోభాల నుంచి గట్టెక్కింది. నిజానికి 2014కు ముందు పదేళ్ల పాటు కాంగ్రెస్ నడిపిన ప్రభుత్వం చాలావరకు డీఎంకే వల్లే నిలబడింది. అయినా, కాంగ్రెస్ శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేసిన అదే డీఎంకేకు ద్రోహం చేసింది. అధికార దురాశ, దాహంతో ఉన్న కాంగ్రెస్ దొరికిన తొలి అవకాశంలోనే డీఎంకేకు వెన్నుపోటు పొడిచింది” అంటూ విమర్శించారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బీజేపీ కార్యకర్తల విజయమని అభివర్ణిస్తూ బెంగాల్లో ఒకప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారని, ఇప్పుడు 200కు పైగా సాధించామని తెలిపారు. అటు కేరళలో ఒకటి నుంచి మూడుకు ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకున్నామని, మెజారిటీ సాధించే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. బీజేపీకి శక్తిని అందించే వాటిలో కర్ణాటక ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏను రాజకీయ స్థిరత్వానికి, అభివృద్ధికి ప్రతిరూపంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. వివిధ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ పాలనా నమూనాకు పెరుగుతున్న ప్రజా మద్దతును ప్రతిబింబిస్తున్నాయని స్పష్టం చేశారు. కర్ణాటకలోని అంతర్గత విభేధాల కారణంగా సుపరిపాలన అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెబుతూ గత మూడేళ్లుగా రాష్ట్రంలో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి బదులుగా అంతర్గత కలహాలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వ నేతలు ప్రాధాన్యమిస్తున్నారని మండిపడ్డారు.
కాగా, బెంగళూరులో ప్రధాని పాల్గొనే బీజేపీ బహిరంగ సభ వద్ద ప్రధాని సమావేశానికి హాజరుకావడానికి ముందు వేదికకు మూడు కిలోమీటర్ల దూరంలోని కగలిపురలో రెండు జిలెటిన్ స్టిక్స్ లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. బాంబు నిర్వీర్వ దళాలు వాటిని అక్కడి నుంచి తరలించినట్లు తెలిపారు.
ఆ జిలెటిన్ స్టిక్స్‌ను అక్కడ పెట్టినట్లు భావిస్తున్న ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. దాంతో అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో విస్తృత సోదాలు నిర్వహించారు. ప్రధాని మోదీ వేదిక వద్దకు చేరుకోవడానికి ముందు ఆయన కాన్వాయ్ వచ్చే మార్గంలో నిర్వహించిన సాధారణ భద్రతా తనిఖీల్లో ఈ జిలెటిన్ స్టిక్స్‌ను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

More Stories
గుజరాత్‌తో సమానంగా తెలంగాణకు నిధులు ఇచ్చేందుకు సిద్ధం
అసోం సీఎంగా మరోసారి హిమంత బిశ్వ శర్మ12న ప్రమాణ స్వీకారం
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం