* సెల్ బ్రాడ్కాస్ట్ను ప్రారంభించిన కేంద్రం
దేశవ్యాప్తంగా కోట్లాది మంది మొబైల్ ఫోన్లలో శనివారం అలర్ట్ మెసేజ్ మారమోగింది. కొత్త తరహా విపత్తు హెచ్చరిక మెసేజ్‌ను భారత్ పరీక్షించింది. ఈ డ్రిల్‌లో భాగంగా మొబైల్ ఫోన్లకు నోటిఫికేషన్ వచ్చింది. భారీగా శబ్ధం చేస్తూ ఫోన్లు మోగాయి. వైబ్రేషన్ కూడా ఇచ్చారు. ఏదైనా విపత్తు సంభవిస్తే, అప్రమత్తంగా ఉండాలన్న ఉద్దేశాన్ని తెలియజేసేందుకు మెసేజ్ డ్రిల్ ఏర్పాటు చేశారు.
సెల్ బ్రాడ్‌కాస్ట్ వార్నింగ్ సిస్టమ్‌ను కేంద్రం కొత్తగా డిజైన్ చేసింది. ఆ సిస్టమ్ ప్రకారం ఇవాళ ఉదయం 11.46 నిమిషాలకు ఎమర్జెన్సీ సీవియర్ అలర్ట్ మెసేజ్ మొబైల్ ఫోన్లపై ప్రత్యక్ష మైంది. ఆ సమయంలో గట్టిగా ట్యూన్ వచ్చింది. ఫ్లాష్ మెసేజ్ తరహాలో ఫోన్ మోగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కమ్యూనికేషన్ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా ఈ సిస్టమ్‌ను ప్రారంభించారు.
సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ దీన్ని డెవలప్ చేసింది. సాచెట్ ఫ్లాట్‌ఫామ్‌పై కొత్త అలర్ట్ సిస్టమ్‌ను డెవలప్ చేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్తో అలర్ట్‌ను మోగించారు. అలర్ట్ మెసేజ్‌ను సీరియస్‌గా తీసుకోవద్దు అని, ఇది కేవలం సెల్ బ్రాడ్‌కాస్ మెసేజ్ వ్యవస్థ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు మెసేజింగ్ చేసినట్లు ప్రభుత్వం ముందుగానే చెప్పింది.
ఒకవేళ ఫోన్ సైలెంట్‌లో ఉన్నా లేదా డునాట్ డిస్టర్బ్ మోడ్‌లో ఉన్నా కొత్త తరహా అలర్ట్ మెసేజ్ మాత్రం మొబైల్ ఫోన్‌పై ప్రత్యక్షం అవుతుంది. అలారం శబ్ధం బలంగా వినిపిస్తుంది. తక్షణమే ఫోన్ వాడే వ్యక్తి ఆ మెసేజ్‌ను చదివే రీతిలో డిస్‌ప్లే చేశారు. భూకంపాలు, సునామీలు, పిడుగుపాటు లాంటి సహజ విపత్తులు సంభవించినప్పుడు, గ్యాస్ లీకేజీలు, రసాయనిక చర్యల సమయంలోనూ కొత్త తరహా అలర్ట్ సిస్టమ్‌ను వాడుకోవచ్చు
అయితే ఇది పరీక్ష మాత్రమేనని, ఎవరూ భయపడొద్దని అధికారులు ఆ సందేశంలోనే వివరించారు. ఈ సందేశం ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా వచ్చింది. అలర్ట్ మెసేజ్ వచ్చిన వారు భయపడాల్సిన అవసరం లేదని భారతీయ టెలీ కమ్యూనికేషన్ శాఖ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

More Stories
మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు!
బీజేపీలో చేరిన సందీప్ పాఠక్‌పై పంజాబ్ లో రెండు కేసులు
బెంగాల్ లో 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్…7 చోట్ల ఆంక్షలు