గతంలో ఇరాన్ నుంచి జరిగిన దాడుల సమయంలో యూఏఈ సొంత రక్షణ వ్యవస్థలు కొన్ని క్షిపణులను అడ్డుకోవడంలో విఫలమయ్యాయి. ఇరాన్ క్షిపణులు లక్ష్యాలను తాకడంతో అబుదాబిలో కీలక కట్టడాలు దెబ్బతిన్నాయి. సుమారు 550 బాలిస్టిక్ క్షిపణులు, 2,200 డ్రోన్ల ముప్పును ఎదుర్కోవడానికి మరింత శక్తివంతమైన వ్యవస్థ అవసరమని యూఏఈ గుర్తించింది.
యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య జరిగిన నేరుగా చర్చల ఫలితంగా ఈ ఒప్పందం కుదిరింది. కేవలం ఆయుధాలను సరఫరా చేయడమే కాకుండా, వాటిని నిర్వహించేందుకు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడిఎఫ్) కూడా యూఏఈలో మోహరించాయి. ఇజ్రాయెల్ తన సరిహద్దు దాటి మరో దేశంలో తన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి.
ఇరాన్ ప్రయోగించిన అనేక క్షిపణులను ఈ వ్యవస్థ గాలిలోనే విజయవంతంగా పేల్చివేసింది. ఈ రక్షణ వ్యవస్థ ఏర్పాటు ఇజ్రాయెల్-యూఏఈ మధ్య పెరుగుతున్న దౌత్య బలానికి ప్రతీకగా నిలిచింది. అమెరికా వంటి దేశాలు కూడా ఈ వ్యవస్థను గుర్తిస్తున్న తరుణంలో, యూఏఈకి ఇజ్రాయెల్ అండగా నిలవడం పశ్చిమాసియాలో ఇరాన్ ప్రభావాన్ని తగ్గించే వ్యూహంలో భాగం.

More Stories
అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబార్డ్ రాజీనామా
బీజింగ్‌లో ట్రంప్ కు విందులో సర్వర్ గా చైనా సైనిక అధికారిణి!
శుద్ధి చేసిన యురేనియం ఇరాన్‌లోనే ఉండాలి