* డీజీపీ ఎదుట లొంగిపోయిన 47 మంది మావోయిస్టులు
తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరైన గణపతి త్వరగా లొంగిపోవాలని డీజీపీ శివధర్‌రెడ్డి మరోసారి బహిరంగంగా విజ్ఞప్తిచేశారు. గణపతితో సహా రాష్ట్రం నుంచి నలుగురు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని చెప్పారు. వారిలో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, పసునూరి నరహరి అలియాస్ సంతోష్, జోడె రత్నాబాయి అలియాస్ సుజాత, వార్తా శేఖర్ అలియాస్ మంగ్తు ఉన్నట్టు వెల్లడించారు.
డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట శనివారం ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దండకారణ్యం స్పెషల్‌జోనల్ కమిటీకి చెందిన 47మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో దండకారుణ్య సౌత్ డివిజన్ కు చెందిన కీలకమైన నాయకులు హేమ్లా ఐతు అలియాస్ విజ్ఞా, పోడియం లచ్చు అలియాస్ మనోజ్ కూడా ఉన్నారు. వారు 32 తుపాకులతోపాటు 515 తూటాలను పోలీసులకు అప్పగించారు.
ప్రభుత్వ పునరావాస ప్యాకేజీ కింద అందరికీ కలిపి సుమారు రూ. కోటిన్నర నగదును రివార్డుగా అందిస్తున్నట్టు డీజీపీ శివధర్‌రెడ్డి చెప్పారు. అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం కూడా అందిస్తామని, అలాగే వీరికి హెల్త్ కార్డులను కూడా అందజేస్తామని తెలిపారు తెలంగాణ పునరావాస విధానానికి ఆకర్షితులై 47 మంది మావోయిస్టులు రాష్ట్రంలో లొంగిపోయారని డీజీపీ తెలిపారు. లొంగిపోయిన వారికి మొత్తం రూ.1.5 కోట్ల రివార్డు ఉందని చెప్పారు.
ఒక్కొక్కరికి రూ.25,000 తక్షణ సహాయం చేస్తున్నామని వివరించారు. 2026లో ఇప్పటి వరకు 260 మంది మావోలు లొంగిపోయారని, ఈ ఏడాది ఇప్పటికే 238 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లుగా శివధర్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లుగా లొంగిపోయిన వారికి ఆరోగ్య కార్డులను ఇస్తామని, అందుకు సంబంధించిన ప్రక్రియ చివరి దశలో ఉందని తెలిపారు.
గతేడాది 2024 మార్చి నుంచి ఈ రెండేళ్లలో తెలంగాణ పోలీసుల ముందు సీనియర్ స్థాయిల, నుంచి కిందిస్థాయి వరకు 818 మంది లొంగిపోయారు. ఈ రెండేళ్లలో 2024లో 36 ఆయుధాలు, 2025లో 60, 2026లో 238 ఆయుధాలతో బయటకు వచ్చారు. ఛత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన వారైనప్పటికీ తెలంగాణలో కొత్తగూడెంలో తిరిగేవారని, వీరు రావడం వల్ల పీఎల్జీఏ బెటాయని సమప్త మయిపోయిందని చెప్పారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కూడా మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఆవిర్భించింది.
తాజాగా మావోయిస్టుల లొంగుబాటుతో పీఎల్జీఏ బెటాలియన్ అంతరించిందని భావిస్తున్నామని తెలిపారు. మరింకా, భారీ సంఖ్యలో లొంగిపోయే మావోయిస్టుల బ్యాచ్ ఇదే చివరిది అనుకుంటున్నామని చెప్పారు. ఎక్కువ సంఖ్యలో లొంగిపోయేందుకు ఇంకా మావోయిస్టులు కూడా లేరని, తెలంగాణ ఇప్పటికే మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని, ఛత్తీస్ గఢ్ కూడా దాదాపు మావోయిస్టు రహతంగా మారినట్లేనని డిజిపి శివధర్ రెడ్డి పేర్కొన్నారు.

More Stories
ఎమ్యెల్సీగా అజారుద్దీన్, కోదండరామ్.. గవర్నర్ ఆమోదం
`తెలంగాణ రాష్ట్ర సేన’ పార్టీ ఏర్పాటు ప్రకటించిన కవిత
సాఫ్ట్వేర్ రంగంలో భద్రతపై హిందూ మహిళల గర్జన