హరివంశ్ నారాయణ్ సింగ్ మూడోసారి రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్‌గా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రి, సభాపక్ష నేత జగత్ ప్రకాష్ నడ్డా హరివంశ్‌ను డిప్యూటీ ఛైర్మన్‌గా తిరిగి ఎన్నుకోవడానికి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. హరివంశ్ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికైనట్లు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ సి.పి. రాధాకష్ణన్ ప్రకటించారు.
ఇక ఈ సందర్భంగా హరివంశ్‌ను మూడవసారి డిప్యూటీ ఛైర్మన్‌గా రాజ్యసభలోకి స్వాగతిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సభా నాయకుడు జేపీ నడ్డా, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గేలు సంప్రదాయంగా ఆయనను తన సీటు వద్దకు తీసుకెళ్లారు. ఏప్రిల్ 9వ తేదీన రాజ్యసభ సభ్యుడిగా హరివంశ్ రెండో టర్మ్ ముగిసింది. దీంతో డిప్యూటీ చైర్మెన్ పోస్టు ఖాళీ ఏర్పడింది. రాజ్యసభ్య వ్యవహారాల ప్రకారం రూల్ 7 కింద చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్డిప్యూటీ చైర్మెన్ కోసం ఎన్నిక నిర్వహించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు హరివంశ్‌ను నామినేట్ చేశారు. మూడోసారి డిప్యూటీ చైర్మెన్‌గా గెలిచిన హరివంశ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, విపక్షనేత మల్లిఖార్జున ఖర్గే అభినందనలు తెలిపారు. రాజ్యసభ చరిత్రలో ఓ నామినేటెడ్ సభ్యుడు డిప్యూటీ చైర్మెన్‌గా ఎన్నిక కావడం ఇదే తొలిసారి. గతంలో హరివంశ్ జర్నలిస్టుగా చేశారు.
హరివంశ్ డిప్యూటీ ఛైర్మన్‌గా తిరిగి ఎన్నికవడం రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే స్వాగతించారు. ఈ సందర్భంగా ఖర్గే సభలో మాట్లాడుతూ ‘మీరు ఇక్కడ చేసిన పనికి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. సభలో మీతో కలిసి కూర్చునే అవకాశం నాకు మరోసారి లభించింది. మీరు మంచి పొరుగువారు (సీటు పక్కన) అని ఖర్గే అనడంతో సభలో నవ్వులు విరిశాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీసభలో హరివంశ్ సేవల గురించి గుర్తు చేశారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్‌తో ఆయనకున్న సన్నిహిత సంబంధాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. హరివంశ్ ఎన్నికపై తీర్మానం పాస్ చేసిన సమయంలో సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ వాకౌట్ చేశారు.

More Stories
బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం
నౌకాదళం చీఫ్‌గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి