గతంలో ఆలయ ప్రాంగణాన్ని ఉదయం 6:30 గంటలకు తెరిచేవారు. బిర్లా ధర్మశాల ముందు ఉన్న గేటు వద్ద ఉదయం 8:30 గంటలకు ప్రవేశం మూసివేయనున్నారు. ఉదయం 9 గంటల తర్వాత సెక్యూరిటీ గేట్ డీ1 నుంచి అనుమతి లేదని ట్రస్ట్ పేర్కొంది. మరోవైపు అయోధ్య రామమందిర పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 25న అయోధ్యలోని రామాలయంలో ఈ సందర్భంగా వేడుకలు నిర్వహించనున్నారు.
ఆలయ నిర్మాణం పూర్తవుతుండడంతో భక్తులు ఆలయ సముదాయాన్ని సందర్శించడానికి అధికారులు అవకాశం కల్పించనున్నారు. మరోవైపు ఆడిటోరియం నిర్మాణం 2026 ప్రథమార్థానికి పూర్తి చేసేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే నవంబర్ 25న జరిగే వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆయనకు ఆహ్వాన లేఖ పంపింది.
అయోధ్యలో నిర్మించిన రామాలయానికి ఉన్న చక్కదనం, తేజస్సు భక్తుల మనస్సును ఇట్టే ఆకర్షిస్తుంది. ఆలయంలోని ప్రతీ భాగం రామాయణ కథలను ప్రతిబింబిస్తుంది. అందుకు అణుగుణంగా ఆలయ అంతస్తులో సుమారు 140 క్లిష్టమైన స్తంభాలను ఏర్పాటు చేశారు. ఇవి రామాలయంలోని దైవిక చిత్రాలు, దృశ్యాలతో కనువిందు చేయనున్నాయి. అవి కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా హిందూ గ్రంథాల్లోని కథలను ప్రతిబింబిస్తాయి.
అదే విధంగా సందర్శకులు నిర్మాణ వైభవాన్ని తిలకించడమే కాకుండా భారత ఆధ్యాత్మిక సంప్రదాయాలను తెలుసుకుంటారు. ఆలయ రూపకల్పన రాబోయే తరాలకు గొప్ప అనుభవాలను మిగల్చనుంది. సౌందర్యానికి అతీతంగా ఈ ఆలయాన్ని వీక్షించడానికి భారతదేశంలోని నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారు. మరోవైపు ఆలయ కాంప్లెక్స్లో 70 శాతం పచ్చదనం వెల్లివిరిసేలా మొత్తం 750 చెట్లను నాటారు.

More Stories
`ఉగ్రవాద లింకులు’ ఆరోపణలపై బెంగాల్ యువకుడి అరెస్ట్
జనాభా లెక్కల సేకరణలో 40 ప్రశ్నలు.. మొదటిసారి కులగణన
ఢిల్లీలోని జార్ఖండ్ భవన్ ఎదుట ఎబివిపి నిరసన