శబరిమల ఆలయానికి విరాళంగా అందిన బంగారు కిరీటం సురక్షితంగానే ఉందని, అది కనిపించడం లేదంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ట్రావన్‌కోర్ దేవస్వమ్ బోర్డు (టీబీడీ) అధ్యక్షుడు కె.జయకుమార్ తెలిపారు. భక్తులు ఇచ్చిన బంగారు కిరీటం శబరిమల సన్నిధానంలోని టీడీబీ స్ట్రాంగ్‌రూమ్‌లో కనిపించడం లేదంటూ వార్తలు రావడంతో ఆయన వెంటనే స్పందించారు.
55.7 సవర్ల బరువున్న ఈ కిరీటం స్టాంగ్‌రూమ్‌లోనే భద్రంగా ఉందని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తిరువాభరణం కమిషనర్ నుంచి తనకు నివేదిక అందిందని, కిరీటం సన్నధానంలోని స్ట్రాంగ్‌రూమ్‌లోనే ఉందని అందులో నిర్ధారించినట్టు తెలిపారు. తమిళనాడుకు చెందిన వైద్యనాథ స్వామి 2012లో ఈ కిరీటాన్ని సమర్పించారు ఏటా ఆయన శబరిమలకు వచ్చినప్పుడు దేవుడికి కిరీటాన్ని అలంకరించిన తర్వాతే వెళ్తారు. అందుకే దీనిని శబరిమలలోని స్ట్రాంగ్‌రామ్‌లో భద్రపరిచారు’ అని ఆయన చెప్పారు.
అరవణ ప్లాంట్ విస్తరణలో భాగంగా పాత స్ట్రాంగ్‌రూమ్‌ను కూల్చివేస్తున్నందున కిరీటాన్ని తాత్కాలికంగా దాని పక్కనే ఉన్న మరో స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించినట్టు తెలిపారు. భక్తుడు ఈ కిరీటానికి బీమా చేయించారని, ప్రత్యేక సందర్భాల్లో దేవుడికి అలంకరించేందుకు దీనిని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బాధ్యతలో ఉంచారని చెప్పారు. రాగితో తయారు చేసిన కిరీటం మాదిరిగా కనిపించే మరో వస్తువు కనిపంచడంతో గందరగోళం ఏర్పడిందని వివరించారు. ఈనెల 23న తనిఖీ నిర్వహించినప్పుడు తిరువాభరణం కమిషనర్ స్వయంగా స్వర్ణ కిరీటాన్ని చూసి ధ్రువీకరించారని జయకుమార్ తెలిపారు.

More Stories
ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంలో భిన్నాభిప్రాయం
కావేరి నదీ జలాల వివాదంలో థర్డ్ పార్టీలు జోక్యం చేసుకోలేవు
జైష్ ఉగ్రవాది గాలింపు కోసం కాశ్మీర్‌లోని 5 జిల్లాల్లో హై అలర్ట్