జీఎస్టీ సంస్కరణలు తీసుకు రావడం ద్వారా సాధారణ ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించిన ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు విశాఖ సాగర తీరంలో పాలాభిషేకం నిర్వహించారు. విశాఖ నగర బిజెపి కార్యకర్తలు ఉదాయాన్నే ఈ కార్యక్రమానికి ప్రదర్శనగా వచ్చి పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జిఎస్టీ తగ్గింపు అన్నివర్గాల ప్రజలు కు దసరా, దీపావళి సంక్రాంతి పండుగ సంబరాలు ముందే వచ్చాయన్న ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు.
కాగా, ఈనెల 14వ తేదీన విశాఖ లో రైల్వే గ్రౌండ్ లో నిర్వహించే భారీ బహిరంగ సభకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా హాజరవుతున్నట్లు మాధవ్ తెలిపారు. సారధ్యం యాత్ర ముగింపు కార్యక్రమంగా ఈ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. పాలాభిషేకం కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు మురళీ పరుశురాం రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, రాష్ట్ర కోశాధికారి నాగేంద్ర, రాష్ట్ర సోషల్ మీడియా ఇంఛార్జి కేశవ్ కాంత్, రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, ఆర్టీఐ కన్వీనర్ వెంగమాంబ శ్రీ నివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

More Stories
కేంద్రం సాయాన్ని, ప్రధాని మోదీ చేయూతను మరువలేం
డీఎస్సీ నిర్వహణ, ఉపాధ్యాయ పోస్టుల భర్తీలపై సీబీఐ విచారణ
విశాఖ ఉక్కు ప్రమాదంపై నివేదిక కోరిన ఎన్ హెచ్ ఆర్ సి