
ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ‘రామాయణ’ సినిమాకు సంబంధించి గ్లింప్స్ తాజాగా విడుదలైంది. నిర్మాత నమిత్ మల్హోత్ర ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ ప్రాజెక్ట్ కోసం రూ.1600 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలి భాగం రూ.900 కోట్లతో, రెండోది రూ.700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారని వినిపిస్తోంది.
ఒక వేళ ఈ సినిమా బడ్జెట్ నిజమైతే అత్యంత ఖరీధైన భారతీయ చిత్రంగా రామాయణ చరిత్ర సృష్టిస్తుంది. ఈ సినిమా కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టంచారట. మొదటి భాగం కోసం ఎక్కువ సెట్స్ వేస్తారట. అందుకే పార్ట్- 2 కంటే తొలి భాగానికే ఎక్కువ బడ్జెట్ అని హిందీ మీడియా తెలిపింది. రెండో భాగంలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట!ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ముఖ్యంగా నేటితరానికి రామాయణాన్ని అందించాలనే ఆలోచనతో ముందుకు సాగుతోంది.
తన బడ్జెట్ మొత్తం తిరిగి పొందడమే కాదు, సినిమా మంచి లాభాలను కూడా అందిస్తుందని మూవీ మేకర్స్ ధీమాగా ఉన్నారు. ఈ సినిమా పై తాము చాలా ఆశలు పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ సినిమా ప్రేక్షకులకు కన్నుల పండుడగా ఉండనుంది. విజువల్స్ థియేటర్స్లో వండర్స్ను క్రియేట్ చేస్తుందని మీడియా వర్గాలు చెబుతున్నాయి. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి పార్ట్ షూటింగ్ పూర్తయింది. నితేశ్ తివారీ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి , రావణుడిగా యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీదేవోల్ లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు.మొదటి పార్ట్ 2026 దీపావళికి, రెండోది 2027 దీపావళికి విడుదల కానున్నాయి.
More Stories
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!
ఐదేళ్లలో వెయ్యి కొత్త రైళ్లు.. 2027 నాటికి బుల్లెట్ రైలు
నకిలీ ఆధార్ కార్డుల తయారీలో బెంగాల్ లో నలుగురు అరెస్ట్