
అంతేకాకుండా ఈ అవార్డును అందుకున్న తొలి విదేశీ నాయకుడిగా ప్రధాని మోదీ నిలిచారు. అనంతరం పార్లమెంట్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి.140 కోట్ల మంది భారతీయుల తరఫున తాను ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశ అత్యున్నత జాతీయ పురస్కారాన్ని అందజేసినందుకు ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రజలకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ పురస్కారం ఇరుదేశాల మధ్య శాశ్వత స్నేహ సంబంధాలకు ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. 180 ఏళ్ల క్రితం నుంచి భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాల మధ్య సంబంధాలు ఉన్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక్కడ స్థిరపడిన భారతీయులే అందుకు నిదర్శనమని చెప్పారు. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు అంకితభావంతో కృషి చేస్తానని చెప్పారు. అనంతరం ట్రినిడాడ్ అండ్ టోబాగో పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్లోబల్ సౌత్ పట్ల భారత్ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
భారత్ అభివృద్ధిని ఇతరుల పట్ట బాధ్యతగా చూస్తుందని పేర్కొన్నారు. “ప్రపంచంలోనే వేగంగా అభిృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థక వ్యవస్థ భారత్. మా అభివృద్ధినిన మేం బాధ్యతగా భావిస్తున్నాం. గ్లోబల్ సౌత్ ఎప్పటికీ మాకు ముఖ్యమే. ఏఐ టెక్నాలజీతో గ్లోబల్ సౌత్లో అభివృద్ధికి సహకరించేందుకు భారత్ చర్యలు తీసుకుంటోంది” అని తెలిపారు. “ఈ విషయంలో ట్రినిడాడ్ అండ్ టోబాగో భాగస్వామ్య దేశంగా ప్రధాన ప్రాధాన్యతను పొందుతుంది. మేం వ్యవసాయం, ఉద్యానవనం, ఆహార్ ప్రాసెసింగ్ రంగాల్లో మేం మా నైపుణ్యాన్ని పంచుకుంటాం. భారతీయ యంత్రాలు మీ వ్యవసాయం పరిశ్రమకు మద్దతు ఇస్తాయి” అని ప్రధాని మోదీ చెప్పారు.
ఉగ్రవాదాన్ని మానవాళికి శత్రువుగా అభివర్ణిస్తూ దానికి ఎటువంటి ఆశ్రయం లేదా స్థలాన్ని నిరాకరించడానికి ప్రపంచ సమాజం ఐక్యంగా నిలబడాలని ఆయన పిలుపిచ్చారు. “ఉగ్రవాదం మానవాళికి శత్రువు. ఈ రెడ్ హౌస్ స్వయంగా ఉగ్రవాద గాయాలను, అమాయకుల రక్తాన్ని కోల్పోయింది. ఉగ్రవాదానికి ఏదైనా ఆశ్రయం లేదా స్థలాన్ని నిరాకరించడానికి మనం ఐక్యంగా నిలబడాలి” అని ఆయన చెప్పారు.
More Stories
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్