బీహార్ లో మరొకొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగవలసి ఉండగా, ప్రముఖ వ్యాపారవేత్త నేత గోపాల్ ఖెమ్కా దారుణ హత్యకు గురయ్యారు. శుక్రర్రాత్రి 11.40 గంటల సమయంలో పట్నాలోని గాంధీ మైదాన్‌లో ఉన్న తన నివాసం వద్ద కారులో నుంచి దిగుతుండగా బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన బిజెపికి సన్నిహితుడిగా భావిస్తున్నారు.
రాష్ట్రంలో అతి పురాతన మగధ దవాఖానకు ఆయన యాజమానిగా వ్యవహరిస్తున్నారు. ఆరేండ్ల క్రితం ఆయన కుమారుడు గుంజన్ ఖెమ్కాను కూడా దుండగులు ఇలానే ఏడేళ్ల క్రితం హత్య చేశారు. 2018 డిసెంబర్ 18న గోపాల్ కుమారుడు గుంజన్ ఖెమ్కా (38) పట్నా శివార్లలోని వైశాలీలో ఉన్న కాటన్ ఫ్యాక్టరీ వద్ద కారులో నుంచి దిగుతుండగా బైక్‌పై వచ్చిన దుండగులు కాల్పులు జరపడంతో మరణించారు.
బంకీపోర్ క్లబ్ డైరక్టర్ కూడా అయిన గోపాల్ శుక్రవారం రాత్రి 11.40 గంటల సమయంలో తన ఇంటికి చేరుకున్నారని, కారు దిగుతుండగా దుండగులు కాల్పులకు తెగబడ్డారని ఆయన సోదరుడు శంకర్ వెల్లడించారు. రాత్రి 2.30 గంటలకు గాని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోలేదని ఆరోపించారు. కాగా, ఘటనా స్థలంలో ఒక బుల్లెట్, షెల్‌ను స్వాధీనం చేసుకున్నామని పాట్నా సీనియర్ పోలీసు అధికారి దీక్షా కుమారి తెలిపారు.
నగర పోలీసు సూపరింటెండెంట్ (సెంట్రల్) దీక్ష మాట్లాడుతూ, ఫోరెన్సిక్ బృందాన్ని సంఘటనా స్థలానికి పిలిపించి, ఒక బుల్లెట్, షెల్ కేసింగ్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.“గాంధీ మైదాన్ దక్షిణ ప్రాంతంలో వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కాను కాల్చి చంపినట్లు మాకు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే, పోలీసులు ఆసుపత్రికి చేరుకుని, ఆపై నేరస్థలానికి చేరుకున్నారు” అని ఆమె చెప్పారు.
హత్య జరిగిన వెంటనే ఎంపీ పప్పు యాదవ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, దుఃఖిస్తున్న కుటుంబ సభ్యులను కలిశారు.స్థానిక పోలీస్ స్టేషన్ సంఘటన జరిగిన ప్రదేశానికి చాలా దగ్గరగా ఉందని ఎత్తి చూపుతూ, పోలీసుల ప్రతిస్పందన ఆలస్యంగా ఉండటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో తన ఆగ్రహాన్ని పంచుకున్న యాదవ్, సంఘటన స్థలం నుండి ఫోటోలను పోస్ట్ చేసి బీహార్‌లో జంగిల్ రాజ్ శిఖరాగ్రంలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ప్రముఖ పారిశ్రామికవేత్త గోపాల్ ఖేమ్కాను రాష్ట్ర రాజధానిలోని గాంధీ మైదాన్ సమీపంలో కాల్చి చంపారు! ప్రభుత్వం సిగ్గుతో చనిపోవాలి! బీహార్ పోలీసులు ముక్కులు తడిపి, సిగ్గుతో ఆత్మహత్య చేసుకోవాలి” అని రాశారు. రాజధాని నగరంలోని అత్యంత భద్రతా ప్రాంతంలో జరిగిన ఈ దారుణ హత్య బీహార్‌లో శాంతిభద్రతల గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.ఏడు సంవత్సరాలలో ఒకే కుటుంబంలో రెండు హత్యలు జరిగి, మునుపటి కేసులో న్యాయం జరగకపోవడంతో, తాజా సంఘటన ప్రజల ఆగ్రహాన్ని రేకెత్తించింది.
More Stories
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!
ఐదేళ్లలో వెయ్యి కొత్త రైళ్లు.. 2027 నాటికి బుల్లెట్ రైలు