
* సరిహద్దుల్లో ఒకేసారి మూడు శత్రువులను ఎదుర్కోవాల్సి వచ్చింది
ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ సైన్యం సరిహద్దుల్లో ఒకేసారి ముగ్గురు శత్రువులను ఎదుర్కోవలసి వచ్చిందని ఆర్మీ డిప్యూటీ చీఫ్ రాహుల్ సింగ్ తెలిపారు. ముందుగా పాకిస్తాన్ ఉంటె, వెనుకగా చైనా, టర్కీ ఉన్నాయని గుర్తు చేశారు. న్యూ ఏజ్ మిలిటరీ టెక్నాలజీలపై ఫిక్కీ నిర్వహించిన ఉన్నత స్థాయి రక్షణ సదస్సులో మాట్లాడుతూ పాకిస్తాన్, చైనా, టర్కీల మధ్య పెరుగుతున్న సైనిక సహకారంపై తీవ్ర ఆందోళనలను లేవనెత్తారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎదురైన ఆధునిక యుద్ధ సవాళ్ల దృష్ట్యా భారతదేశం తన వైమానిక రక్షణ, సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాల్సిన తక్షణ ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆ సమయంలో వేళ చైనా తన ఆయుధాలను పరీక్షించినట్లు పేర్కొంటూ ఆపరేషన్ సిందూర్ ను లైవ్ వెపన్స్ ల్యాబ్ గా వాడిందని పేర్కొన్నారు.
చైనా సహాయంతో పాకిస్థాన్ మన గురించి లైవ్ అప్‌డేట్స్ తెలుసుకున్నదని, మన ఆయుధాల అంశాన్ని పాకిస్థాన్‌కు ఎప్పటికప్పుడు చేరవేసిందని రాహుల్ సింగ్ వివరించారు. పాకిస్థాన్ వద్ద 81 శాతం మిలిటరీ హార్డ్‌వేర్ చైనాదే ఉందని ఆయన చెప్పారు. పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను పేల్చేందుకు భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే.
ఆ ఆపరేషన్ ఎన్నో పాఠాలు నేర్పినట్లు డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ తెలిపారు. టర్కీ కూడా పాకిస్థాన్‌కు కీలకమైన మద్దతు ఇచ్చిందని, బైరక్తార్‌తో పాటు ఎన్నో రకాల డ్రోన్లను అందజేసిందని గుర్తు చేశారు. శత్రువుకు అత్యాధునిక ద్రోణులు సమకూరడంతో యుద్ధరంగం సంక్లిష్టంగా మారిందని, భారత్ తన వాయు రక్షణ వ్యవస్థను ఆధునీకరించుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేసిందని తెలిపారు.
డీజీఎంఓ స్థాయి చర్చలు జరుగుతున్నప్పుడు మన ఆయుధాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పాకిస్థాన్ వద్ద ఉన్నట్లు వెల్లడయిని పేర్కొంటూ ఆ సమాచారాన్ని చైనా చేరవేసిందని చెబుతూ పాకిస్తాన్- చైనా మధ్య సైనిక సహకారం మన రక్షణకు ప్రమాదకరంగా మారిందని ఆయన హెచ్చరించారు.
“ డీజీఎంఓ స్థాయి చర్చలు జరుగుతున్నప్పుడు, మన ముఖ్యమైన వాహకాలు సిద్ధంగా ఉన్నాయని, చర్యకు సిద్ధంగా ఉన్నాయని తమకు తెలుసునని పాకిస్తాన్ బహిరంగంగా పేర్కొంది. ఈ నిఘా వారికి చైనా నుండి నేరుగా అందుతోంది” అని ఆయన తెలిపారు. ఈ దశలో మనకు బలమైన వాయు రక్షణ వ్యవస్థ కావాలని లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ తెలిపారు.
ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎయిర్ డిఫెన్స్ కీలకంగా మారిందని, ఆ ఆపరేషన్ కొన్ని పాఠాలు నేర్పిందని పేర్కొన్నారు. ఈ దశలో మనకు బలమైన వాయు రక్షణ వ్యవస్థ కావాలని లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ తెలిపారు. కానీ ఆపరేషన్ సింధూర్ వేళ భారతీయ సైనిక బలగాలు చాలా కచ్చితత్వంతో ఉగ్ర స్థావరాలపై దాడులు చేశాయని చెబుతూ మానవ మేధస్సు, టెక్నాలజీ మధ్య వ్యూహాత్మక సహకారం ఉండాలని సూచించారు.
ఆపరేషన్ సింధూర్ కోసం 21 టార్గెట్లను గుర్తించామని, దీంట్లో 9 టార్గెట్లను ఎంచుకున్నామని, ఆపరేషన్ జరిపే చివరి రోజు మాత్రమే ఆ 9 టార్గెట్లను ద్రువీకరించామని పేర్కొన్నారు. త్రివిధ దళాలు ఐక్యంగా ఆపరేషన్‌లో పాల్గొన్నాయని తెలిపారు. సైనిక లక్ష్యం చేరుకున్న తర్వాత దాన్ని ఆపాల్సి ఉంటుందని, యుద్ధం ప్రారంభించడం చాలా సులువు అని, కానీ దాన్ని నియంత్రించడం కష్టమైందని చెప్పారు. సరైన సమయంలో యుద్ధాన్ని ఆపి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చామని పేర్కొన్నారు.
More Stories
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!
ఐదేళ్లలో వెయ్యి కొత్త రైళ్లు.. 2027 నాటికి బుల్లెట్ రైలు