మూడు ఇరాన్‌ అణుస్థావరాలపై అమెరికా దాడులు

మూడు ఇరాన్‌ అణుస్థావరాలపై అమెరికా దాడులు
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌లోని మూడు కీలక అణు కేంద్రాలు, ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్‌లపై అమెరికన్ దళాలు వైమానిక దాడులు నిర్వహించాయని ప్రకటించారు. ఈ కేంద్రాలు ఇరాన్ అణు మౌలిక సదుపాయాలలో కీలకమైన భాగాలుగా పరిగణించబడుతున్నాయి. 
 
ఈ దాడులు కొనసాగుతున్న సంఘర్షణలో గణనీయమైన పెరుగుదలను సూచిస్తాయి. ఇరాన్ అణు ఆశయాలను కూల్చివేసేందుకు రెండు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నందున, ఇజ్రాయెల్ ప్రయత్నాలతో సమన్వయంతో అమెరికా ఆపరేషన్ నిర్వహించినట్లు సమాచారం  ఇరాన్‌పై బీ-2 స్పిరిట్‌ బాంబులతో అమెరికా విరుచుకుపడింది. దేశంలోని మూడు అణు స్థావరాలపై దాడులు చేసింది.
 
“ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలపై మేము విజయవంతంగా దాడులు చేశాం. వాటిలో ఫార్దో, నంతాజ్‌, ఇస్ఫహాన్‌ కూడా ఉన్నాయి. ఫోర్డో పై భారీ బాంబులు ఫార్డోపై వేశాం. ఇరాన్‌ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేశాం. విమానాలు సురక్షితంగా తిరుగుముఖం పట్టాయి. అమెరికా సైనికులకు అభినందనలు. ప్రపంచంలో మరే మిలిటరీకి ఇది సాధ్యంకాదు. ఇప్పుడు శాంతికి సమయం” అని తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌లో ట్రంప్ పోస్టు చేశారు. 
 
అదేవిధంగా ఓపెన్‌ సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ ప్రకారం ఫోర్డో నాశనమైందని పేర్కొన్నారు. ఇరాన్‌ శాంతిని నెలకొల్పాలని, తదుపరి చర్యలు నిలిపివేయాలని కోరారు. టెహ్రాన్‌ ప్రతి దాడులకు దిగేతే తాము తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు. కాగా, ఇరాన్‌పై దాడుల అనంతరం ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూతో ఆయన మాట్లాడారు.  అయితే ఫోర్డో అణు స్థావరంపై దాడులకు ఆరు బంకర్‌ బస్టర్ల బాంబులను, 30 టొమాహాక్‌ క్షిపణులను అమెరికా ఉపయోగించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. 
 
ఆదివారం మీడియా ప్రసంగంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి సాధించకపోతే అమెరికా అదనపు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుంటుందని హెచ్చరించారు. “ఇరాన్‌కు శాంతి లేదా విషాదం ఉంటుంది” అని ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో కలిసి తాను “ఒక జట్టుగా” పనిచేశానని చెప్పారు.
 
ఫోర్డో వద్ద ఉన్న పర్వత కేంద్రం, నటాంజ్ వద్ద ఉన్న సుసంపన్న కర్మాగారం ఇరాన్ యొక్క అత్యంత కీలకమైన యురేనియం సుసంపన్న కేంద్రాలలో ఒకటి. ఇరాన్‌పై విజయవంతమైన దాడులకు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ట్రంప్‌ను అభినందించారు, ఇరాన్‌ను దాడి చేయాలనే ట్రంప్ నిర్ణయం “చరిత్రను మారుస్తుంది” అని పేర్కొన్నారు. 
అమెరికా దాడులను ఇరాన్‌ కూడా ధ్రువీకరించింది. ఫోర్డో అణు స్థావరం లక్ష్యంగా తమ శత్రువులు వైమానిక దాడులకు పాల్పడినట్లు అధికారులు టాస్మిన్‌ న్యూస్‌ ఏజెన్సీకి వెల్లడించారు.  నంతాజ్‌, ఇస్ఫహాన్‌ అణుకేంద్రాలపై కూడా దాడులు జరిగినట్లు తెలిపారు. కాగా, ఇరాన్‌పై అమెరికా దాడులతో ఇజ్రాయెల్‌ అప్రమత్తమైంది. తమపై టెహ్రాన్‌ ప్రతిదాడులకు పాల్పడవచ్చనే అంచనాతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా స్కూళ్లు, కార్యాలయాలను మూసివేసింది. 
అత్యవసర సేవలు మాత్రమే కొనసాగడానికి అనుమతించింది. ఇరాన్ పై సైనిక చర్యకు ట్రంప్ రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ ప్రకటించిన రెండురోజులకే ఇలా జరగడం గమనార్హం.  వాషింగ్టన్‌కు చెందిన ఇరాన్ మానవ హక్కుల సమూహం ప్రకారం, ఇరాన్‌లో ఇప్పటివరకు కనీసం 657 మంది మరణించారు, వీరిలో 263 మంది పౌరులు ఉన్నారు. 2,000 మందికి పైగా గాయపడ్డారు. ప్రతీకారంగా, ఇరాన్ ఇజ్రాయెల్‌పై 450 క్షిపణులు, 1,000 డ్రోన్‌లను ప్రయోగించింది, ఫలితంగా కనీసం 24 మంది మరణించారు.