
ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ యూనివర్సిటీ చోటు దక్కించుకున్నది. 2026 క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ను గ్లోబల్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ఎనలిస్ట్ క్యూఎస్ క్వాక్వారెల్లి సైమండ్స్ విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా 801-850 ర్యాంకుల మధ్య యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నిలిచింది.
మొత్తం 8467 విద్యా సంస్థలను ఈ సంస్థ అధ్యయనం చేసింది. భారత్‌లోని 54 యూనివర్సిటీలతో సహా 106 ప్రాంతాల్లోని 1501 విద్యా సంస్థల ప్రమాణాలను పరిశీలించింది. కాగా, క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026 ఎడిషన్‌లో ‘సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీ’ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 335వ ర్యాంక్ సాధించినందుకు తాము సంతోషిస్తున్నట్లు హైదరాబాద్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీజే రావు తెలిపారు.
రెండు విభిన్న డేటాసెట్‌లను క్యూఎస్ సేకరిస్తుందని చెప్పారు. అలాగే విద్యా సంస్థల స్థిరత్వం, ఉపాధి అవకాశాల ఫలితాలు, అంతర్జాతీయ పరిశోధన నెట్‌వర్క్, విద్యతోపాటు యజమాన్యం ఖ్యాతి, అధ్యాపక విద్యార్థి నిష్పత్తి వంటి వాటిని గ్లోబల్ ర్యాంకులకు కొలమానంగా పరిగణిస్తారని వెల్లడించారు.
యూఎస్, యూకే, చైనా తర్వాత నాలుగో స్థానంలో భారత్ నిలిచింది. కాగా, ఈ సారి 200లోపు ర్యాంకింగ్స్‌లో భారత్‌కు చెందిన యూనివర్సిటీలు మూడే ఉన్నాయి. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్ టాప్ 200లో నిలిచాయి. ఐఐటీ ఢిల్లీ గతేడాది సాధించిన 150వ స్థానం నుంచి 123 స్థానానికి ఎగబాకింది. ఐఐటీ బాంబే మాత్రం గతేడాది ర్యాంక్ 118 నుంచి 129వ స్థానానికి చేరుకుంది.
ఇక ఐఐటీ మద్రాస్ 180వ ర్యాంక్ సాధించింది. ఇక యూఎస్‌లోని మాసచెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరుసగా పద్నాలుగోసారి మొదటి ర్యాంక్‌ను సాధించింది. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ రెండోస్థానం, యూఎస్‌లోని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ మూడో స్థానంలో నిలిచాయి.
More Stories
హెచ్‌సీఏ వ్యవహారంపై ఈడీ దృష్టి
రాజాసింగ్ రాజీనామా ఆమోదించిన జేపీ నడ్డా
‘స్థానిక’ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్