బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగితే రూ.1000 జరిమానా

బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగితే రూ.1000 జరిమానా

బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగితే రూ.1000 జరిమానా విధించనుంది ఝార్ఖండ్ ప్రభుత్వం. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై ఝార్ఖండ్ సవరణ బిల్లు 2021కు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆమోదం తెలిపడంతో ఈ మేరకు రాజ్ భవన్ సెక్రటేరియట్ ప్రకటన విడుదల చేసింది. ఈ సవరణ బిల్లును ఆమోదానికి ముందు రాష్ట్రంలో బహిరంగ ప్రదేశంలో సిగరెట్లు తాగితే రూ. 200 జరిమానా విధించే నిబంధన ఉంది.

అయితే ప్రస్తుతం ఇది ఐదు రెట్లు పెరిగి రూ. 1000 చేరుకుంది. ఈ సవరణను బిల్లును హేమంత్ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల క్రితం అసెంబ్లీలో ఆమోదించింది. ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో అప్పటి ఎజేఎస్యూ ఎమ్మెల్యే లంబోదర్ మహతో సవరణ ప్రతిపాదన ద్వారా బహిరంగ ప్రదేశంలో సిగరెట్లు తాగితే జరిమానా మొత్తాన్ని రూ.1000 నుంచి రూ. 10,000కి పెంచాలని డిమాండ్ చేశారు. అయితే 21 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారికి పొగాకును అమ్మడం నేరమని చెప్పారు.

 అయితే ఈ బిల్లును ఝార్ఖండ్ ప్రభుత్వం ఆమోదించడానికి ఓ నెల ముందు మంత్రివర్గం రాష్ట్రంలో హుక్కా బార్లను నిషేధించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష లేదా లక్ష రూపాయల వరకు జరిమానా కట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.