విజయవాడలో శాతవాహన కళాశాల నేలమట్టం

విజయవాడలో శాతవాహన కళాశాల నేలమట్టం
విజయవాడ నగరం నడిబోడ్డున గల ఎంతో చరిత్ర కలిగిన శాతవాహన కళాశాలను కూల్చివేశారు. గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కళాశాల భవనాన్ని అక్రమంగా నేలమట్టం చేశారు. దీంతో కళాశాల వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కూల్చివేతను నిరసిస్తూ అధ్యాపకులు, విద్యార్థి సంఘాల ఆందోళనలు, పోలీసుల రంగ ప్రవేశం… ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు కళాశాల వద్ద చోటుచేసుకుంది. 
 
కళాశాల భవనాన్ని కూల్చివేయడమే కాకుండా బోయపాటి శ్రీనివాస అప్పారావు పేరుతో అక్కడ బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. గత కొన్నేళ్లుగా కళాశాల యాజమాన్యం మధ్య విభేదాల కారణంగా కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కళాశాల భవనాన్ని అక్రమంగా నేలమట్టం చేశారు. దీంతో కళాశాల వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 
 
కూల్చివేతను నిరసిస్తూ అధ్యాపకులు, విద్యార్థి సంఘాల ఆందోళనలు, పోలీసుల రంగ ప్రవేశం… ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు కళాశాల వద్ద చోటుచేసుకుంది. కళాశాల భవనాన్ని కూల్చివేయడమే కాకుండా బోయపాటి శ్రీనివాస అప్పారావు పేరుతో అక్కడ బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. గత కొన్నేళ్లుగా కళాశాల యాజమాన్యం మధ్య విభేదాల కారణంగా కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి.
 
ఎటువంటి ముందస్తు నోటీసులు, సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే గుట్టుచప్పుడు కాకుండా కళాశాల భవనాలను బోయపాటి అప్పారావుకు చెందిన వారు నేలమట్టం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళాశాల స్థలం తమకే చెందుతుందని చెప్పి భవనాలను కూల్చివేసి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు బోయపాటి శ్రీనివాస అప్పారావు పేరుతో నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. 
 
కూల్చివేత సమాచారాన్ని ఆలస్యంగా తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ప్రొక్లయినర్లతో కళశాలను కూల్చివేసి నేలమట్టం చేశారు. తమకు ఎటువంటి కోర్టు ఉత్తర్వులూ అందలేదని పోలీసులు స్పష్టం చేశారు.

శాతవాహన కళాశాలను అక్రమంగా కూల్చివేయడమే కాకుండా పెద్దఎత్తున అల్లర్లకు పాల్పడ్డారని బోయిపాటి శ్రీనివాస్‌ అప్పారావు, డి.శ్రీకాంత్‌, వి శ్రీనివాసరావు, ఎం రమా సత్యనారాయణతోపాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు సూర్యరావుపేట సిఐ మమహ్మద్‌ అలీ మీడియాకు వివరించారు. సెక్షన్లు 324/క్లాస్‌ 5, 329/4 బిఎన్‌ఎస్‌ కింద వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.