
* ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎలాన్ మస్క్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతున్నది. గురువారం బిగ్ బ్యూటీఫుల్ బిల్లుపై ట్రంప్‌ను ఉద్దేశించి మస్క్ నేరుగానే విమర్శలు గుప్పించడమే కాకుండా ట్రంప్‌ను అభిశంసించి, ఆ స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌నకు సంబంధాలున్నాయని, ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరుందని, అందుకే దానిని ఆయన బయటపెట్టడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ వ్యవహారంలో మస్క్ తీరుతో తాను విసిగిపోయానంటూ ట్రంప్ పేర్కొన్న కొద్ది సేపటికే మస్క్ ఈ తీవ్ర ఆరోపణ చేయడం గమనార్హం.
ట్రంప్, మస్క్ మధ్య వివాదం ముదిరిన నేపథ్యంలో అమెరికన్ ఫండ్ మేనేజర్ బిల్ ఆక్‌మన్ రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. దేశ ప్రయోజనం కోసం ఇద్దరూ చేతులు కలపాలని ఎక్స్‌లో కోరారు. ఇందుకు మస్క్ సానుకూలంగా స్పందించారు. అయితే మస్క్‌తో మాట్లాడేందుకు ట్రంప్ సుముఖంగా లేనట్టు సమాచారం
కాగా ట్రంప్ విధించిన టారిఫ్‌ల కారణంగా ఈ ఏడాది రెండో భాగంలో దేశం మాంద్యంలోకి జారుకుంటుందని మస్క్ ఎక్స్‌లో పేర్కొన్నారు. “మా బడ్జెట్‌లో నిధులను, బిలియన్ల కొద్దీ డాలర్లను ఆదా చేయాలంటే సులభమైన మార్గం ఎలాన్ మస్క్‌కు ఇచ్చిన ప్రభుత్వ సబ్సిడీలను, కాంట్రాక్టులను రద్దు చేయడమే” అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటనతో టెస్లా షేర్లు 14.3 శాతం నష్టపోయి, 150 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది.
ఒకే రోజు ఇంత గరిష్ట స్థాయిలో నష్టపోవడం టెస్లా చరిత్రలో ఇదే ప్రథమం. ఇది జరిగిన కొద్ది సేపటికి ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి అభిశంసించాలంటూ మస్క్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. “చూడండి.. ఎలాన్, నేను గొప్ప సంబంధాన్ని కలిగి ఉన్నాము. ఇక ముందు ఇలాగే ఉంటామో లేదో తెలియదు’ అని ట్రంప్ అంటుండగానే దానికి మస్క్ తీవ్రంగా లైవ్‌లోనే స్పందించారు. ‘నేను లేకుంటే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు. ట్రంప్, ఇతర రిపబ్లికన్లకు దాదాపు 300 బిలియన్ డాలర్లు ఖర్చు చేశాం. ఇదా కృతజ్ఞతా?” అని మస్క్ ప్రశ్నించారు.స్పేస్ ఎక్స్, టెస్లా సహా మస్క్ కంపెనీలకున్న ఫెడరల్ కాంట్రాక్టులన్నీ రద్దు చేస్తానని ట్రంప్ చేసిన హెచ్చరికపై మస్క్ సైతం దీటుగానే స్పందిస్తూ నాసాకు కీలకమైన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌ను స్పేస్ ఎక్స్ తొలగించడం ప్రారంభిస్తుందని హెచ్చరించారు. సైన్స్ మిషన్‌లను ప్రారంభించడం, ఈ దశాబ్దం తర్వాత వ్యోమగాములను చంద్రుని ఉపరితలం వైపు తిరిగి పంపడం వంటి కీలక ప్రాజెక్టుల కోసం నాసా కూడా ఎక్కువగా స్పేస్ ఎక్స్‌పైనే ఆధారపడుతున్నది. ఈ క్రమంలో మస్క్ హెచ్చరిక ప్రాధాన్యతను సంతరించుకుంది.
More Stories
యోగా మానవతను పెంచే సామూహిక పక్రియ.. మోదీ
పాక్ వైమానిక, సైనిక స్థావరాలపై ట్రంప్ కన్ను!
ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో ఏకాకిగా ఇరాన్