బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ విజయోత్సవాల్లో తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మార్కెటింగ్ విభాగం అధికారి నిఖిల్ సొసాలేని కూడా ఉన్నారు.
బెంగళూరు విమానాశ్రయం నుంచి ముంబై వెళ్తుండగా నిఖిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే మరో ముగ్గురు నిందితులు. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ డీఎన్‌ఏకి చెందినవారని తెలిసింది. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ డీఎన్ఏకు చెందిన సునిల్ మాథ్యూ, కిరణ్, సుమంత్‌ను కూడా అరెస్టు చేశారు. ఐపీఎల్ ఈవెంట్లను సునిల్ మాథ్యూ ఆర్గనైజ్ చేస్తుంటాడు. అతను డీఎన్ఏ వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నాడు.
మరోవైపు ఈ కేసుకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కి చెందిన కార్యదర్శి శంకర్, కోశాధికారి జయరామ్ పరారీలో ఉన్నారు. ఈ ఘటన నేపథ్యంలోనగర పోలీసు కమీషనర్ బీ దయానందను సస్పెండ్ చేయగా ఆయన స్థానంలో సీమంత్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. దయానంద్‌తో పాటు అదనపు కమీషనర్ వికాశ్ కుమార్ వికాశ్, డిప్యూటీ కమీషనర్ శేఖర్ హెచ్‌టీ, అసిస్టెండ్ కమీషనర్ బాలకృష్‌ణ, కబ్బాన్ పార్క్ ఇన్‌స్పెక్టర్ గిరీశ్ ఏకే కూడా సస్పెండ్ అయ్యారు.

More Stories
పరిశీలనలో పదహారేళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!
దేశంలోనే తొలి డెంగ్యూ వ్యాక్సిన్‌కు కేంద్రం ఆమోదం
జమ్ముకశ్మీర్‌లో వరద బీభత్సం…17 మంది మృతి