
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం – బనకచర్ల ప్రాజెక్టలపై కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు లేవనెత్తిన పలు సందేహాలకు ఏపీ అధికారులు సమాధానాలు ఇచ్చారు. సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఏపీ అధికారులు జరిపిన అత్యున్నత సమావే దాదాపు రెండు గంటల పాటు జరిగింది. సమావేశంలో ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి పియూష్ కుమార్, నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ ప్రాజెక్ట్ వల్ల రైతులకు అత్యధిక మేలు జరుగుతుందని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అలాగే పలు ప్రాంతాలకు సాగు, తాగు నీరు సైతం అందించ వచ్చని ప్రభుత్వం చెబుతుంది. ఈ బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు అత్యధిక లబ్ది చేకూరనుంది. వీటితో పాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సైతం నీటి సమస్య తీరనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
సుమారు రూ. 81,000 కోట్ల వ్యయం కాగల ఈ ప్రాజెక్ట్ వల్లనా దాదాపు 80 లక్షల మంది ప్రజలకు ఉపయోగం కలగనుందని పేర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఈ బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల గోదావరి వరద నీటిని రాయలసీమ బేసిన్‌కు తరలించడం వల్ల కలిగే లాభాలను కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి ఏపీ అధికారులు వివరించారు. ఈ ప్రాజెక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభ్యంతరాల గురించి కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు ఏపీ అధికారులు వివరించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే గత నెల జరిగిన భేటీల్లో ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లకు ముఖ్యమంత్రి చంద్రబాబు మనాయుడు వివరించారు. అలాగే ఈ ప్రాజెక్ట్‌పై జలవనరుల శాఖ మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు.
నదులు అనుసంధానంతోపాటు దేశంలో అనేక ప్రాజెక్టులు చేపడుతున్న వేళ రాయలసీమలోని జిల్లాలకు బనకచర్ల ద్వారా నీరు అందాలని తమ ప్రభుత్వం భావిస్తుందని ఆ లేఖలో స్పష్టం చేశారు. గోదావరి వరద నీటిని సముద్రంలోకి వృధాగా పంపే కంటే బనకచర్ల ద్వారా రాయలసీమతోపాటు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు పంపడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని ఏపీ ప్రభుత్వ స్పష్టం చేస్తోంది.
More Stories
యోగా దినోత్సవంకు ముస్తాబవుతున్న విశాఖ
గోదావరి జలాలపై కలిసి మాట్లాడుకొందాం
ప్రముఖ సాహితీవేత్త పులిచెర్ల సాంబశివరావు ఇక లేరు