
ఇస్లామిక్ స్టేట్ ఆప్ ఇరాక్, సిరియా- ఐసిస్ స్లీపర్ సెల్ విభాగంతో వీరికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఇద్దరు నిందితులను ఎన్ఐఎ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఐసిస్ సానుభూతి పరులైన వీరు 2023లో ఉగ్రవాదుల కోసం పుణేలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైసెస్- ఐఈడిలు, ఇతర పేలుడు పదార్థాలు తయారు చేసినట్లు గుర్తించారు.
అదే కేసులో 8 మంది ఐసిస్ సానుభూతిపరులను అరెస్టు చేయగా, వీరిద్దరు మాత్రం ఎన్ఐఎ కళ్లుగప్పి ఇండోనేషియా పారిపోయారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఐఈడీలు తయారుచేసిన ప్రదేశంలోనే బాంబు తయారీ వర్క్షాపులు కూడా నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. వారిపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.
వారి సమాచారం ఇస్తే ఒక్కొక్కరికి మూడు లక్షలు ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం, హింస, ఉగ్రవాదం ద్వారా దేశంలో ఇస్లామిక్ పాలనను స్థాపించాలన్న ఐసిస్ ఎజెండా కోసం వీరు పనిచేసినట్లు అధికారులు తెలిపారు. భారత్‌లో శాంతి, మత సామరస్యాన్ని దెబ్బతీయాలని కుట్ర పన్నారని వివరించారు
More Stories
కోయంబత్తూర్ కారు బాంబు కేసులో మరో నలుగురు అరెస్ట్
వీసాల అనిశ్చితతో అమెరికాలో చదువులపై వెనకడుగు!
విశ్లేషణ కోసం విదేశాలకు విమానం బ్లాక్ బాక్స్