
పహల్గాంలో ఏప్రిల్ 22న 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు అమానుషంగా కాల్చిచంపడంతో అంతే వేగంగా ప్రతిగా భారత సాయుధ బలగాలు ‘ఆపరేషన్ సిందూర్’ తో పాక్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు జరిపింది. తొమ్మిది చోట్ల ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసి, 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. దీంతో పాక్ లెక్కకు మిక్కిలిగా డ్రోన్లతో భారత మిలిటరీ స్థావరాలపై దాడులకు తెగబడింది.
దీంతో భారత్ ఫైటర్ జెట్లు తమ గగనతంలోకి అడుగుపెట్టినట్టు అనుమానించిన పాకిస్థాన్ తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను యాక్టివేట్ చేసింది. దీంతో కీలకమైన మిలిటరీ ఎస్సెట్స్ లొకేషన్లను పాక్ బయటపెట్టినట్టయింది. వెంటనే ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా బ్రహ్మోస్ క్షిపణులతో పాకిస్థాన్ కీలక ఎయిర్‌బేస్‌లపై భారత్ విరుచుకుపడింది. దీంతో ఆయోమయంలో చిక్కిన పాక్ బలగాలు భారత్ దాడులను తిప్పికొట్టలేక తోకముడిచాయి.
ఈ ఆపరేషన్‌లో పాక్‌కు చెందిన 11 ఎయిర్‌బేస్‌లు బాగా దెబ్బతినట్టు భారత అధికారుల సమాచారం. అత్యంత వ్యూహాత్మకమైన భొలారి ఎయిర్‌బేస్‌లోని కీలక ఏడబ్ల్యుఏసీఎస్ సిస్టమ్‌ను భారత్ ధ్వంసం చేసినట్టు పాకిస్థాన్ మాజీ ఎయిర్ మార్షల్ ఒకరు వెల్లడించారు. కాగా, భారత్ బలగాలు జరిపిన దాడి ట్రయిల్ మాత్రమేనని, సమయం వచ్చినప్పుడు పూర్తి సినిమా చూపిస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. గుజరాత్‌లోని భుజ్ ఎయిర్ బేస్‌ను శుక్రవారం నాడు సందర్శించిన సందర్భంగా పాక్‌ను హెచ్చరించారు.
More Stories
యువతలో పెరుగుతున్న అక్యూట్ మైలోయిడ్ లుకేమియా
గుజరాత్లో వంతెన కూలి 10 మంది మృతి
ఆధార్ ఎప్పుడూ మొదటి గుర్తింపు కాదు