
2015, అక్టోబర్ 22వ తేదీన రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. దీంతో అందుకు సంబంధించిన పనులు శరవేగంగా ప్రారంభమైయ్యాయి. ఆయా పనులకు కొనసాగుతుండగా, ఇంతలో 2019 అసెంబ్లీ ఎన్నికలలో అధికారం చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి `మూడు రాజధానులు’ పేరుతో అమరావతి కట్టడాల పనులను మూలాన పడవేశారు.
తిరిగి గత ఏడాది మూడు పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి, పోలవరం ప్రోజెక్టుల నిర్మాణం తన తొలి ప్రాధాన్యతలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పైగా, కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో టిడిపి, జన సేనలు కూడా కీలక భాగస్వాములు కావడంతో కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి నిర్మాణానికి పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ వస్తున్నది.
ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు, నాబార్డ్ వంటి సంస్థల ద్వారా రుణాలు మంజూరు చేయించింది. దానితో అమరావతి నిర్మాణపు పనులు పెద్ద ఎత్తున ప్రారంభం కానున్నాయి. మరోవంక, దక్షిణాది రాష్ట్రాలలో విస్తరించాలని చూస్తున్న బిజెపికి సహితం ఈ ప్రాజెక్టులు ప్రాధాన్యత సంతరింప చేసుకున్నాయి. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తమిళనాడులో పర్యటించి, వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ఉమ్మడిగా పోటీ చేసేందుకు అన్నా ఎఐఎడిఎంకెతో ఎన్నికల పొత్తు కుదురఃసుకున్న కొద్దీ రోజులకే మోదీ ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు రావడం గమనార్హం.
More Stories
ఏపీ పట్టణాల్లో స్లీపర్సెల్స్ పై పోలీసుల డేగకన్ను
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి అంత్యక్రియలు
అమరావతిలో రూ 1 లక్ష కోట్ల పనులకు ప్రధాని మోదీ శ్రీకారం