
తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు పాదరక్షలతో భక్తులు చేరుకున్నారు. ఆ ముగ్గురుని విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద భక్తులను గుర్తించకుండా తనిఖీ సిబ్బంది పంపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రంలో ఇటివలే భద్రత వైఫల్యం కనిపించింది.
తిరుమలకు చేరుకున్న అన్యమత వ్యాఖ్యలతో కూడిన ఓ కారు కనిపించింది. సాధారణంగా అలిపిరి తనిఖీ కేంద్రంలో రాజకీయ పార్టీల చిహ్నాలు, అన్యమత చిహ్నాలు, ఫొటోలు అనుమతించరు. అయితే కారుపై అన్యమత వ్యాఖ్యలు ఉన్నాయి. అది తిరుమలకు చేరుకోవడంపై టీటీడీ తనిఖీ భద్రతా వైఫల్యాన్ని సూచిస్తుంది.
అలాగే కొద్దిరోజుల కిందట అలిపిరి గేటు వద్ద తనిఖీలను తప్పించుకుని ఓ అన్యమత వ్యక్తి బైకుతో ఘాటు రోడ్డులో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. విచారించిన సిబ్బంది అతని మానసిక పరిస్థితి సక్రమంగా లేదని తేల్చారు. ఇకనైనా తనిఖీ కేంద్రం సిబ్బంది పటిష్ట తనిఖీలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
More Stories
ఏపీ పట్టణాల్లో స్లీపర్సెల్స్ పై పోలీసుల డేగకన్ను
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి అంత్యక్రియలు
అమరావతిలో రూ 1 లక్ష కోట్ల పనులకు ప్రధాని మోదీ శ్రీకారం