రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్

రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్
ఢిల్లీ అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ముఖ్యమంత్రి రేఖా గుప్తా  మంగళవారంనాడు ప్రవేశపెట్టారు. రూ. లక్ష కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ చరిత్రాత్మకమని సీఎం అభివర్ణించారు. 26 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇదే కావడం విశేషం. ‘అవినీతి, అసమర్ధ’ శకం ముగిసిందని, కొత్త బడ్జెట్‌లో మూలధన వ్యయం రెట్టింపు చేశామని సీఎం తెలిపారు. 
 
రూ.లక్ష కోట్లతో బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టామని, గత బడ్జెట్ కంటే ఇది 31.5 శాతం ఎక్కువని, ఇదొక అసాధారణ, చారిత్రక బడ్జెట్ అని ఆమె చెప్పారు. ఈ బడ్జెట్ ప్రధానం 10 కీలక రంగాలపై దృష్టి సారించింది. విద్యుత్, రోడ్లు, నీళ్లు, అనుసంధానం వంటివి ఇందులో ఉన్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో రవాణా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1,000 కోట్లు కేటాయించారు. 
 
సంక్షేమ పథకాల్లో భాగంగా అర్హత కలిగిన మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం అందించేందుకు రూ.5,100 కోట్లు కేటాయించారు. అదనంగా, రాజధానిలో హెల్త్‌కేర్ సర్వీసులను మెరుగుపరచేందుకు ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజనకు రూ.2,144 కోట్లు కేటాయించారు. గత బడ్జె్ట కంటే మూలధన వ్యయం దాదాపు రెట్టింపు చేశారు. గత ఏడాది క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ రూ.15,000 కోట్లు ఉండగా, దానిని ఈసారి రూ.28,000 కోట్లకు పెంచారు.ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో రవాణా అనుసంధానం మెరుగుపరచేందుకు రూ.1,000 కోట్లు కేటాయించారు. బ్రిడ్జిల నిర్మాణం, నిర్వహణకు రూ.3,843 కోట్లు, పీఎం జన్ ఆరోగ్య యోజనకు రూ.2,144 కోట్లు. ఆయుష్మాన్ భారత్ యోజన కింద రూ.10 లక్షల కవరేజీ,  మహిళా సమ్మాన్ యోజన కింద మహిళలకు నెలనెలా రూ.2,500 ఆర్థిక సాయం అందించేందుకు రూ.5,100 కోట్ల కేటాయింపులు జరిపారు.
మహిళా భద్రతను పెంచేందుకు సిటీ అంతటా 50,000 సీసీటీవీల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.  సామాజిక భద్రత, సంక్షేమం కోసం రూ.10,047 కోట్లు కేటాయించారు. గర్భిణీ మహిళలకు పోషకాహారం అందించే మాతృత్వ వందన్ యోజనకు రూ.210 కోట్లు కేటాయింపులు జరిపారు. 1,000 అధునాతన అంగన్వాడి కేంద్రాల నిర్మాణం ప్రకటించారు.యమునా జలాల ప్రక్షాళనకు రూ.500 కోట్లు,  సివేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్ (ఎస్‌టీపీ) మరమ్మతు, ఆధునీకరణకు రూ.500 కోట్లు, పాత సీవర్ లైన్స్‌ను మార్చేందుకు రూ.250 కోట్లు, స్వచ్ఛమైన తాగనీరు, పారిశుధ్యం, సంబంధిత ప్రాజెక్టులకు రూ.9,000 కోట్లు కేటాయింపులు జరిపారు.

మునక్ కెనాల్ ద్వారా నీటి పైప్‌లైన్ల ఏర్పాటు, నీటి చోరీని అరికెట్టేందుకు ఇంటెలిజెన్స్ మీటర్ల ఏర్పాటుకు రూ.200 కోట్లు, . ఆరోగ్య రంగానికి రూ.6,874 కోట్లు, స్మమ్ క్లస్టర్ల అభివృద్ధికి రూ.696 కోట్లు, ఢిల్లీ వ్యాప్తంగా అటల్ క్యాంటీన్ల ఏర్పాటుకు రూ.100 కోట్లు కేటాయించారు.  పీఎం ఎస్‌హెచ్ఆర్ఐ స్కూళ్ల స్ఫూర్తితో విద్యా వ్యవస్థలో సంస్కరణల కోస సీఎం ఎస్‌హెచ్ఆర్ఐ స్కూళ్లను ప్రారంభిస్తారు. వీటికోసం ఈ సంవత్సరం రూ 100 కోట్లు కేటాయించారు.

10వ తరగతి ఉత్తీర్ణలైన 1,200 మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అణ్డంచడంకోసం రూ.750 కోట్లు, ఢిల్లీ స్కూళ్లలో ఏపీజే అబ్దుల్ కలామ్ పేరుతో 100 ల్యాంగ్వేజ్ ల్యాబ్‌ల ఏర్పాటుకు రూ.21 కోట్లు, 175 ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్‌లు, స్మార్ట్ క్లాసులు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు.