
ఇదిలావుంటే నటి అనన్య నాగళ్లను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు సోషల్ మీడియాలో తిట్టడం మొదలుపెట్టారు. అయితే తనపై వస్తున్న విమర్శలను ఆమె తీవ్రంగా తిప్పికోట్టింది. బెట్టింగ్ యాప్స్ ప్రభుత్వమే ప్రమోట్ చేస్తుంటే మాకేలా తెలుస్తుంది? అంటూ ఆమె ప్రశ్నించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రమోట్ చేస్తున్న వన్ ఎక్స్ బెట్టింగ్ యాప్ ఫొటోను పంచుకుంది.
ప్రభుత్వానికి చెందిన సంస్థ (హైదరాబాద్ మెట్రో) బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తుంటే అవి చట్టవిరుద్ధంగా ప్రమోట్ చేయబడుతున్నాయని మనం ఎలా తెలుసుకోవాలి? అంటూ అనన్య ఇన్‌స్టాలో రాసుకోచ్చింది. మరోవైపు తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు క్షమాపణలు తెలిపింది అనన్య.
“దయచేసి నన్ను క్షమించండి. నేను తెలిసి తప్పు చేయలేదు. అందరూ టాప్ సెలబ్రిటీలు చేస్తున్నారు కాబట్టి తప్పు కాదని అనుకున్నాను. ఇప్పటినుంచి చాలా జాగ్రత్తగా బాధ్యతగా ఉంటాను. మళ్లీ ఇలాంటి పొరపాటు జరగకుండా చూస్తాను” అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
“అప్పట్లో ఆలోచన లేకుండా, అవగాహన లేని స్థితిలో ఈ పని చేశాను. ఒక వీడియో స్టోరీ పోస్ట్ చేసినందుకు వాళ్లు రూ.1,20,000 చెల్లించారు. అప్పుడు నేను దాన్ని కేవలం గేమింగ్ యాప్‌గా, ఒక సాధారణ యాడ్‌గా మాత్రమే చూశాను. కానీ అది బెట్టింగ్ యాప్ అని, దీని వెనుక ఇన్ని సమస్యలు ఉంటాయని అప్పట్లో గ్రహించలేకపోయాను. తర్వాత వాళ్లు ఇచ్చిన డబ్బును కూడా వెనక్కి ఇచ్చేశాను” అంటూ అనన్య వెల్లడించారు.
More Stories
లద్దాఖ్, పీఓకె లేని భారత్ మ్యాప్ వివాదంలో రేవంత్ ప్రభుత్వం
తెలంగాణకు వచ్చిన పాక్ పౌరులు వాఘా సరిహద్దు దాటాలి
కాళేశ్వరంలో డిజైన్లు, నాణ్యతలో ప్రమాణాలకు తిలోదకాలు