యూపీఐ లావాదేవీలకు రూ. 1500 కోట్ల ప్రోత్సాహకాలు

యూపీఐ లావాదేవీలకు రూ. 1500 కోట్ల ప్రోత్సాహకాలు
చిన్న యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.1500 కోట్లు కేటాయించింది. తక్కువ విలువ కలిగిన యూపీఐ లావాదేవీలకు ఈ ఇన్సెంటివ్ స్కీమ్ కింద ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. 
 
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. చిన్న వ్యాపారులకు యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ వ్యక్తి నుంచి వ్యాపారికి ట్రాన్సాక్షన్ చేసిన సమయంలో ఇన్సెంటివ్ అందుతుందన్నమాట. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు ఈ ప్రోత్సాహకాలు అందుబాటులో ఉంటాయి.

ఒక్కమాటలో చెప్పాలంటే యూపీఐ లావాదేవీలకు అనుమతించినందుకు చిన్న వ్యాపారులు ఒక్కో ట్రాన్సా‌క్షన్‌పై 0.15 శాతం ప్రోత్సాహం పొందుతారు. అంతకంటే ఎక్కువ మొత్తం లావాదేవీలపై మాత్రం ప్రోత్సాహకాలు ఉండవు. ఇక ఈ మొత  ప్రతి త్రైమాసికాల్లో బ్యాంకులు ఎలాంటి షరతులు లేకుండా క్లెయిమ్ మొత్తంలో 80 శాతం వరకు ఇవ్వాల్సి ఉంటుంది. 

 
ప్రస్తుతం యూపీఐ లావాదేవీలకు ఎండిఆర్ ఛార్జీలు లేవు. వచ్చే ఏడాది కూడా ఈ పథకం కొనసాగుతుందని మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు.  ఇక ఇక్కడ చిన్న మొత్తంలో ట్రాన్సాక్షన్స్ అంటే గరిష్టంగా రూ. 2 వేల లోపు చేసే ట్రాన్సాక్షన్స్‌పైనే ప్రోత్సాహకాలు అందుతాయని గుర్తుంచుకోవాలి. చిన్న వ్యాాపారులకు మాత్రమే ఇక్కడ ప్రయోజనం చేకూరుతుందన్నమాట. 
 
వీరికి రూ. 2 వేల వరకు ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) ఛార్జీలు లేవు. ఇన్వెంటివ్ 0.15 శాతంగా ఉంది. పెద్ద వ్యాపారులకు ఎండీఆర్ ఛార్జీలు లేవు. ఇన్సెంటివ్స్ కూడా లేవు. రూ. 2 వేల పైన విలువ చేసే యూపీఐ లావాదేవీలపైనా చిన్న, పెద్ద వ్యాపారులకు ఎవరికీ ఎండీఆర్ ఛార్జీలు లేవు. ఇన్సెంటివ్స్ కూడా లేవు.

యూపీఐ లావాదేవీల ప్రయోజనాలు

  • సులువుగా డబ్బులు పంపడానికి, భద్రంగా ఉండడానికి, త్వరగా డబ్బు చేతికి రావడానికి డిజిటల్ చెల్లింపులు ఉపయోగపడతాయి. దీనివల్ల రుణం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
  • సామాన్య ప్రజలు.. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా యుపిఐ ద్వారా సులువుగా డబ్బులు పంపుకోవచ్చు.
  • చిన్న వ్యాపారులు కూడా ఎలాంటి ఖర్చు లేకుండా యూపీఐ సేవలను ఉపయోగించుకోవచ్చు. చిన్న వ్యాపారులు ధరల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి.. వారికి యుపిఐ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తుంది.
  • ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. డిజిటల్ రూపంలో లావాదేవీలు చేయడం వల్ల లెక్కలు చూపడానికి సులువుగా ఉంటుంది. అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయడం ద్వారా నగదు వాడకం తగ్గించాలనేది ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా ఉంది.

ఇదే సమయంలో రూ.10,601 కోట్లతో అసోంలో కొత్త అమ్మోనియా యూరియా కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అప్పుడు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని మంత్రి చెప్పారు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం రూ.2,790 కోట్లు కేటాయించారు. నవీ ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ పోర్ట్‌ను నేషనల్ హైవేతో కలుపుతూ 6 లైన్ రహదారి నిర్మాణానికి రూ. 4,500 కోట్లు కేటాయించింది.