
నాగపూర్‌లో వదంతులు వ్యాపింపజేసి, హింసాసంస్కృతిని ప్రోత్సహించిన జిహాదీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే, ఔరంగజేబ్ సమాధి స్థానంలో ధనాజీ, సంతాజీ, ఛత్రపతి రాజారాం మహారాజ్ గారి స్మారకం నిర్మించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. పరిషత్ కేంద్రీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, మహారాష్ట్రలోని నాగపూర్‌లో సోమవారం రాత్రి జరిగిన హింస, దహన చర్యలు ముస్లిం సమాజంలోని ఒక వర్గంచే చేపట్టబడినవని, అవి పూర్తిగా ఖండనీయమైనవని పేర్కొన్నారు.
అలాగే, బజరంగ్ దళ్ కార్యకర్తల ఇళ్లపై దాడులు జరిగాయని, హిందూ సమాజంలోని చాలా ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, మహిళలను కూడా వదల్లేదని తెలిపారు. ఇంతటితోనే కాకుండా, హిందూ సమాజం ఆయతులు (ఇస్లామిక్ వచనాలు) దహనం చేసిందన్న అసత్య ప్రచారం జరిపి, హింసను రెచ్చగొట్టే ప్రయత్నం జరిగిందని పేర్కొంటూ ఇది మన్నించరానిదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందువల్ల, ఈ హింసాకాండకు పాల్పడిన జిహాదీ శక్తులపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే, ఛత్రపతి సంభాజీ మహారాజ్ నగరంలోని ఔరంగజేబ్ సమాధిని ఇంకేమాత్రం గౌరవించకూడదని, దానిలో మార్పులు చేయాలనే ఆలోచన కూడా వద్దని ఆయన స్పష్టం చేశారు.
దాని స్థానంలో, ఔరంగజేబ్‌ను ఓడించిన ధనాజీ జాధవ్, సంతాజీ ఘోర్పడే, ఛత్రపతి రాజారాం మహారాజ్‌ల విజయ స్మారకం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. మరాఠా సామ్రాజ్యంలో ఔరంగజేబ్‌ను ఓడించిన విజయ చిహ్నంగా ఒక స్తూపం నిర్మించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తోందని మిలింద్ పరాండే తెలిపారు.
More Stories
కోయంబత్తూర్ కారు బాంబు కేసులో మరో నలుగురు అరెస్ట్
వీసాల అనిశ్చితతో అమెరికాలో చదువులపై వెనకడుగు!
విశ్లేషణ కోసం విదేశాలకు విమానం బ్లాక్ బాక్స్