ప్రపంచ జిడిపి వృద్ధిలో ఆసియా కీలక పాత్ర

ప్రపంచ జిడిపి వృద్ధిలో ఆసియా కీలక పాత్ర

ప్రపంచ జిడిపి వృద్ధిలో ఆసియా కీలక పాత్ర పోషిస్తోంది. 1960ల కంటే 2023 నాటికి ప్రపంచ జిడిపిలో ఆసియా వాటా ఊహించని స్థాయిలో పెరిగిందని ప్రపంచ బ్యాంకు నివేదికలే చెబుతున్నాయి. ప్రపంచంలో ఖండాల వారీగా చూసుకుంటే యూరప్‌, ఉత్తర, దక్షిణ అమెరికాల కంటే ఆసియా జిడిపి వృద్ధి పెరిగిందని ప్రపంచ బ్యాంకు వరల్డ్‌ డెవలప్‌మెంట్‌ ఇండికేటర్‌ (డబ్ల్యుడిఐ) సమాచారం వెల్లడించింది.

1960 నుంచి దశాబ్దాలవారీగా పరిశీలిస్తే ప్రపంచ జిడిపిలో ఆసియా ఖండం జిడిపి వాటా పెరిగిందని డబ్ల్యుడిఐ సంఖ్యల్నిబట్టి చూస్తే తెలుస్తుంది. 2010-2023 మధ్య కాలంలో ప్రపంచ జిడిపిలో ఆసియా వాటా 34.5 శాతంగా ఉంది. ఆసియా జిడిపి వాటా పెరుగుతుంటే.. మరోవైపు ఉత్తర అమెరికా, యూరప్‌ జిడిపి వాటా తగ్గిందని డబ్ల్యుడిఐ సమాచారం పేర్కొంది.

ప్రపంచ జిడిపి వృద్ధిలో ఆసియా వాటా 1960 దశాబ్దంలో 17.2 శాతం నుండి 2010-23 మధ్య 48.5 శాతంకి పెరిగింది. ప్రత్యేకించి 1990ల నుంచి పరిశీలిస్తే.. ప్రపంచ జిడిపిలో ఆసియానే అతిపెద్ద వాటాదారుగా నిలిచింది. ఉత్తర అమెరికా, యూరప్‌లు ఆధిపత్యంలో ఉన్న సమయంలో కంటే.. ప్రపంచ జిడిపి వృద్ధికి ఆసియా జిడిపి వాటా ఎక్కువగా ఉంది. 

యూరప్‌ వాటా 1960ల్లో 30 శాతంగా ఉంది. అదే 2010-23 కల్లా 18.9 శాతానికి పడిపోయింది. ఇక ఉత్తర అమెరికాది కూడా అదే పరిస్థితి. 1960ల్లో ఉత్తర అమెరికా జిడిపి 28.7 శాతంగా ఉంది. 2010-23కి 23.1 శాతానికి పడిపోయింది. ప్రపంచ జిడిపిలో అమెరికా, చైనా జిడిపిలు కీలకంగా మారాయి. 2023 ఆసియా జిడిపిలో 49.6 శాతం చైనా నుంచే వచ్చింది. 

2010-23లో 44.7 శాతంగా ఉంది. ప్రపంచ జిడిపి వాటాలో అమెరికా, చైనా ఆర్థిక వ్యవస్థలు చాలా ప్రధానపాత్ర పోషిస్తున్నాయి. 2010-23లలో అమెరికా 39.9 శాతం, చైనా 47.7శాతంగా ఉన్నాయి. ప్రపంచ జిడిపి వృద్ధిలో భారత్‌ ఈ సమయంలో ప్రధాన వాటాదారుగా ఉండేందుకు ప్రయత్నించింది. కానీ ఈ రెండు దేశాల జిడిపి కంటే భారత్‌ తక్కువ వాటానే కలిగి ఉంది.

ప్రపంచంలో అమెరికా, చైనాల ఆర్థిక వ్యవస్థల మద్యే ప్రధాన పోటీ నెలకొంది. 2023లో అమెరికా, చైనాలు రెండు దేశాలు కలిపి ప్రపంచ జిడిపి వాటాలో 42.6 శాతంగా ఉంది. గత రెండు దశాబ్దాలుగా ఈ నిష్పత్తి పెరుగుతోంది. 2010-23లో అత్యధిక జిడిపి వాటా 15.6 శాతం వాటాతో రెండోస్థానంలో నిలిచింది. 1960లో జర్మనీ వాటా 8.7 శాతంగా ఉంది.

ఇక జపాన్‌ 1970ల నుంచి 1990ల సగటు 9.4 శాతంగా ఉంది. 1960ల్లో అమెరికా జిడిపి వాటా 33.2 శాతంగా ఉంది. కానీ క్రమంగా తగ్గుతూ 2010-23కల్లా 24.4 శాతానికి పడిపోయింది. దీన్నిబట్టి చూస్తే ఇతర దేశాల కంటే కూడా చైనా చాలా వేగంగా ముందుకొచ్చింది. 2000ల నుంచి చైనా ఆర్థిక వ్యవస్థ బలం పుంజుకుని ప్రస్తుతం రెండో ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. బహుశా అమెరికా, చైనా ఆర్థిక వ్యవస్థల మధ్యే ఎకానమిక్‌ వార్‌ జరుగుతోందని ట్రెండ్‌నుబట్టి తెలుస్తోంది.