అంతరిక్షంలో 8 రోజుల ఉండేందుకు బయలుదేరిన నాసా వ్యోమగాములు సునితా విలియమ్స్, బుచ్ విర్మోర్ అనూహ్యంగా కొన్ని సమస్యల కారణంగా ఏకంగా 9 నెలలపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో చిక్కుకు పోయారు. మొత్తం మీద స్పేస్ ఎక్స్ డ్రాగాన్ అంతరిక్ష నౌక లో భూమికి రెండు మూడు రోజుల్లో తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు.
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో బుధవారం భూమిపైకి తిరిగిరానున్నారు. ఐఎస్ ఎస్ లో ఉన్న సునితా విలియమ్స్, విల్మోర్ లను సురక్షితంగా భూమికి తెచ్చేందుకు నాసా ఆమోదంతో డ్రాగాన్ అంతరిక్ష నౌకతో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ గత శుక్రవారం సాయంత్రం ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా
అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.
నాసా-స్పేస్ ఎక్స్‌లు చేపట్టిన క్రూ-10 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నిగింలోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ క్యాప్సుల్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ఈ ప్రయోగంద్వారా నలుగురు వ్యోమగాములు మెక్‌క్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లారు. ఈ నలుగురు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ స్థానంలో పనిచేయనున్నారు.
కాగా, సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ దాదాపు తొమ్మిది నెలలుగా ఐఎస్‌ఎస్‌లోనే ఉంటున్న విషయం తెలిసిందే. వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా-స్పేస్ ఎక్స్‌లు సంయుక్తంగా క్రూ-10 మిషన్‌ను చేపట్టాయి. ఇందులో భాగంగా ఫాల్కన్-9 రాకెట్‌ను మూడురోజుల క్రితం ప్రయోగించాలనుకున్నప్పటికీ గ్రౌండ్ సపోర్ట్ క్లాంప్ ఆర్మ్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరి నిమిషయంలో రద్దు చేశారు. ఇక శనివారం రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు.
టెస్ట్ మిషన్ కోసం బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో విలియమ్స్, విల్‌మోర్ 2024, జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లారు. ఎనిమిది రోజుల తర్వాత వారు భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది. అయితే స్టార్‌లైనర్ స్పేస్ క్రాఫ్ట్.. ఐఎస్‌ఎస్‌ను చేరుకోగానే సమస్యలు తలెత్తాయి. అందులోని ప్రొపల్షన్ సిస్టమ్‌లో లీకులు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడంతోపాటు హీలియం కూడా అయిపోయింది.
ఈ నేపథ్యంలో వ్యోమగాములను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని ఆగస్టు నెలాఖరు నాటికి నాసా ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో వ్యోమగాములు లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ 2024, సెప్టెంబర్ 7న క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి సునీత, విల్‌మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు.
More Stories
చైనాపై సుంకాలను తగ్గిస్తామన్న ట్రంప్
ఉగ్రదాడి సమయంలో భారత్ కు ట్రంప్ మద్దతు
శనివారం పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు