
పూరి జగన్నాథ ఆలయంలో అరుదైన ఘటన చోటుచేసుకున్నది. జగన్నాథుడి ఆలయ శిఖరంపై ఉన్న జెండాలు ముడిపడ్డాయి. ఆదివారం ఈ సంఘటన జరిగింది. శిఖరంపై ఉన్న జెండాలు తీవ్రమైన గాలులకు ముడిపడ్డాయి. దీన్ని సున్య గంతిగా పేర్కొంటారు. ఇది మంగళకరమైన సంకేతమని స్థానికులు, పూజారులు అంటున్నారు.
పురాణ గాథల ప్రకారం సున్య గంతి ప్రక్రియ ఓ విశిష్టమైన సంప్రదాయం. బలమైన గాలులు వీస్తున్నప్పుడు శిఖరంపై ఉన్న జెండాలు ఆ గాలులకు అటూ ఇటూ కొట్టుకుంటాయి. ఆ జెండాలు ముడిపడడం అత్యంత అరుదు. అయితే ఆదివారం ఆ ఘటన చోటుచేసుకున్నది. చాలా బిగ్గరగా జెండాలు పెనవేసుకున్నాయి. ఇది ఆధ్యాత్మిక విశ్వసాలను మరింత బలపరుస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
పూరి శ్రీమందిరంపై ఉన్న బానాలు అంటే జెండాలు ఒకటిని ఒకటి అల్లుకపోయాయి. అతివేగంగా వీస్తున్న గాలుల వల్ల ఈ ప్రక్రియ ఏర్పడుతుంది. ఇలాంటి అద్భుతం జరగడం అత్యంత అసాధారణ ఘటనగా ఆలయ పూజారులు భావిస్తున్నారు. ఇది మంగళరమైన సంకేతమని, శిఖరంపై ఉన్న జెండాలు బలంగా అల్లుకపోవడం అంటే అది మనకు రక్షణాత్మక సూచన ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
అన్ని రకాల రుగ్మతలను పారద్రోలే సందర్భం ఇది అని చెబుతున్నారు. భోగభాగ్యాలకు సంకేతం అని కూడా అంటున్నారు. మార్చి 16వ తేదీన ఆలయ పరిసరాల్లో చాలా బలమైన గాలులు వీచాయి. ఆ సమయంలో పతితపావన జెండాలు తీవ్రంగా అల్లుకపోయాయి. జెండాలు ముడిపడడం అంటే అది శక్తివంతమైన ఆధ్యాత్మిక శోభకు సంకేతమని భక్తులు విశ్వసిస్తున్నారు.
దైవ దీవన ఉన్నట్లుగా కూడా భావిస్తున్నారు. సున్య గంతి ఏర్పడడం వల్ల నెగటివ్ శక్తులు పారిపోతాయని స్థానిక పురాణాలు వెల్లడిస్తున్నాయి. జెండాలు ఓ బంధంగా ఏర్పడడం అంటే అమితమైన భాగ్యానికి సంకేతంగా కూడా భావిస్తారు. పూరి ఆలయ శిఖరంపై ఉన్న జెండాలకు సున్య గంతి ఏర్పడడం పట్ల భక్తులు, ఆధ్యాత్మికవేత్తల్లో మరింత ఆసక్తిని పెంచింది. భక్తులు, భగవంతుని మధ్య గాఢమైన బంధాన్ని పెంచే సందర్భం ఇదే అని భావిస్తున్నారు. ఈ ఘటన విశ్వాసానికి, రక్షణకు, దైవ దీవనకు ప్రతీకగా నిలుస్తుందంటున్నారు.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత
వక్ఫ్ సవాల్ చేసిన పిటిషన్లను కొట్టివేయాలని కోరిన కేంద్రం