
తాము సంప్రదింపులకు ఎప్పుడూ సిద్ధమేనని ఆమె చెప్పారు. రాజకీయ, ఆర్థిక భౌగోళిక అస్థిర పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో సుంకాల భారాన్ని తమ దేశాలు ఆర్థికంగా మోయలేవని ఆమె స్పష్టం చేశారు. ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులతోపాటు జౌళి, చర్మ వస్తువులు, గృహోపకరణాలు, ఇంటి పనిముట్లు, ప్లాస్టిక్, కలప వంటి వస్తువులతోపాటు పౌల్ట్రీ, బీఫ్, సీఫుడ్, నట్స్, గుడ్లు, చక్కెర, కూరగాయలు వంటి వ్యవసాయ పదార్థాల ధరలపై కూడా ప్రభావం ఉంటుందని కమిషనర్ చెప్పారు.
తాను విధించే పన్నుల వల్ల అమెరికా ఫ్యాక్టరీలలో ఉపాధి కల్పన జరుగుతుందన్న ట్రంప్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ యూరపు, అమెరికాలో కూడా ఉద్యోగాలు పోవడంతోపాటు ధరల పెరుగుదల ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అమెరికా పన్నులతో వ్యాపారాలే కాక వినియోగదారులు తీవ్రంగా నష్టపోతారని ఆమె హెచ్చరించారు.
మరోవంక, తమ దేశానికి చెందిన ఉక్కు, అల్యూమినియంపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతీకారంగా కెనడా కూడా అమెరికా వస్తువులపై రూ. 20.7 బిలియన్ డాలర్ల విలువైన సుంకాలను విధిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. గురువారం నుంచి అమలులోకి వచ్చే ఈ కొత్త సుంకాలు కంప్యూటర్లు, క్రీడా సామగ్రి వంటి వివిధ రకాల వస్తువులపై ఉంటాయి.
కాగా, అమెరికన్ మద్యం, వ్యవసాయ ఉత్పత్తులపై భారత ప్రభుత్వం భారీగా సుంకాలు విధిస్తున్నదని ట్రంప్ ప్రభుత్వం విమర్శించింది. అమెరికన్ వస్తువులపై భారతీయ సుంకాలు ప్రస్తుత వాణిజ్య పరిస్థితికి ఏమాత్రం దోహదపడబోవని వైట్ హౌస్ పత్రికా కార్యదర్శి క్యాథరిన్ లీవిట్ స్పష్టం చేశారు. అమెరికన్ డెయిరీ ఉత్పత్తులపై కెనడా దాదాపు 300 శాతం సుంకాన్ని విధిస్తోందని, అమెరికన్ ఆల్కహాల్(మద్యం)పై భారత్ 150 శాతం, వ్యవసాయ ఉత్పత్తులపై 150 శాతం సుంకాన్ని విధిస్తోందని ఆమె చెప్పారు. ఇలాంటి పరిస్థితులలో భారత్‌కు అమెరికా ఉత్పత్తులు ఎలా ఎగుమతి అవుతాయని ఆమె ప్రశ్నించారు.
More Stories
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
100 కోట్ల టన్నులు దాటిన బొగ్గు ఉత్పత్తి
ప్రపంచ వృద్ధిని దెబ్బ తీస్తున్న ట్రంప్ విధానాలు