
స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం నేపథ్యంలో భారత్‌లోని మారమూల ప్రాంతాలకు సైతం హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించే సామర్థ్యం ఎయిర్‌టెల్‌కు కలుగుతుంది. దాంతో ప్రతి వ్యక్తికి, వ్యాపారాలకు, కమ్యూనిటీలకు వేగవంతమైన ఇంటర్నెట్ లభిస్తుంది. ఒప్పందం మేరకు ఎయిర్‌టెల్ రిటైల్ స్టోర్స్‌లో స్టార్‌లింక్ పరికరాలు అందుబాటులోకి ఉంటాయి. ఎయిర్‌టెల్ స్టోర్స్‌లో స్టార్‌లింక్ పరికరాలను విక్రయిస్తారు.
వాటితో ఎయిర్‌టెల్ వినియోగదారులకు నేరుగా స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందుతాయని విట్టల్ పేర్కొన్నారు. ఎయిర్‌టెల్ ఇప్పటికే శాటిలైట్ ఇంటర్నెట్‌ను అందిస్తోంది. యూటెల్‌సాట్ వన్‌వెబ్‌తో భాగస్వామ్యంతో ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నది. తాజాగా స్టార్‌లింక్‌తో ఒప్పందం నేపథ్యంలో మారమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ కవరేజ్ విస్తరించనున్నది.
More Stories
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
100 కోట్ల టన్నులు దాటిన బొగ్గు ఉత్పత్తి
ప్రపంచ వృద్ధిని దెబ్బ తీస్తున్న ట్రంప్ విధానాలు