రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి ఒక్క తప్పు చేయాలని అంటే ఐఏఎస్ లు మూడు తప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు.
సీఎంగా ఉంటూ అవినీతిని, తప్పులను నిరోధించాల్సింది పోయి తప్పులు చేయాలని చెప్పడమేంటని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రే అవినీతి, తప్పులు జరుగుతున్నాయని ఒప్పుకున్నట్లయిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మంత్రుల మధ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందని ఆరోపించారు.
కొందరు మంత్రులు సొంత దుకాణాలు ఓపెన్ చేసి ప్రతి పనికి 15శాతం చొప్పున కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు.
“పీపుల్స్ పల్స్ సహా అనేక సర్వే సంస్థలు ఈసారి ఎంఎల్‌సి ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందని స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ కు అభ్యర్థులు దొరకక బయటనుండి అద్దెకు అభ్యర్థులను తెచ్చుకున్నాయి. బిఆర్‌ఎస్ అసలు పోటీలోనే లేదు. ఈసారి 3 ఎంఎల్‌సి స్థానాల్లో బిజెపి గెలవడం తథ్యం” అంటూ సంజయ్ భరోసా వ్యక్తం చేశారు.
కులగణన పేరుతో కాంగ్రెస్ కొరివితో తలగొక్కోం టోందని ధ్వజమెత్తారు. బిసి జాబితాలో ముస్లింలను చేర్చి బిల్లు పంపితే కేంద్రం ఎట్లా ఆమోదిస్తుంది? మేమేమైనా ఎడ్డోళ్లమా? ముస్లింలను బిసిల్లో ఎట్లా కలుపుతారు? అని ప్రశ్నించారు. “మాకు గోత్రం ఉంటది. వాళ్లతో మాకు పోలికేంది? ముస్లింలను బిసి జాబితా నుండి తీసివేస్తే ఆ బిల్లును ఆమోదింపజేసే బాధ్యత మేం తీసుకుంటాం. లేకుంటే ఆమోదించే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి రూ.56 వేల నిరుద్యోగ భ్రుతి, ప్రతి మహిళకు స్కూటీ, తులం బంగారం, ప్రతి ఉద్యోగికి పీఆర్సీ, 4 డీఏలు, రైతులకు రైతు భరోసా, బోనస్, రుణమాఫీ బాకీ పడిందని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్ అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బాకీల కాంగ్రెస్ సర్కార్ ను బండకేసి బాదాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం కరీంనగర్ లోని కొండా సత్య లక్ష్మీ గార్డెన్ లో ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాల్లోని బీజేపీ మండలాధ్యక్షులతో సమావేశం నిర్వహించారు.
ఎంపీలు రఘునందన్ రావు, జి.నగేశ్, ఎమ్మెల్యేలు కాటేపల్లి వెంకటరమణారెడ్డి, పాయల శంకర్, పాల్వాయి హరీష్ బాబు మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, బొడిగె శోభ, జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ మేయర్లు సునీల్ రావు, డి.శంకర్, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
More Stories
సామరస్యపూర్వక, వ్యవస్థీకృత హిందూ సమాజ నిర్మాణం
మహారాణి అబ్బక్కకు ఆర్ఎస్ఎస్ ఘనంగా నివాళులు
`సర్వ స్పర్శి, సర్వవ్యాపి’గా ఆర్ఎస్ఎస్ అన్ని అంశాల స్పృశి