
కేరళ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జ్ఞానేశ్‌కుమార్ (61) గతంలో పలు కీలక శాఖల్లో సేవలందించారు. ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేసే బిల్లు రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. అయోధ్యలో రామమందిరం కేసుకు సంబంధించిన పత్రాల వ్యవహారాన్ని.. హోం శాఖలో అదనపు కార్యదర్శిగా ఆయనే పర్యవేక్షించారు.
‘శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, కేంద్ర సహకార శాఖల కార్యదర్శిగా పనిచేశారు. గత ఏడాది జనవరిలో ఆయన రిటైర్ అయ్యారు. సీఈసీ పదవిలో 2029 జనవరి 26 దాకా ఆయన కొనసాగనున్నారు. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి.. ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ (అప్పాయింట్‌మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీ్‌స)చట్టం-2023’ పేరుతో రూపొందించిన కొత్త చట్టం ప్రకారం సీఈసీ నియామకం ఇదే మొదటి సారి కావడం విశేషం.
కాంగ్రెస్ అభ్యంతరం
పాత విధానం ప్రకారం ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి కూడా సభ్యుడిగా ఉండేవారు. అయితే, 2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంలో భారత ప్రధాన న్యాయమూర్తికి బదులు కేంద్ర మంత్రివర్గం నామినేట్ చేసే మంత్రికి స్థానం కల్పించింది (దాని ప్రకారమే ఇప్పుడు కేంద్ర మంత్రివర్గం తరపున కేంద్రమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి కమిటీలో సభ్యుడిగా హాజరయ్యారు).
దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై తీర్పు వచ్చే దాకా కొత్త చట్టం ప్రకారం నూతన సీఈసీ నియామకాన్ని వాయిదా వేయాలని కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. ఉన్నతస్థాయి కమిటీ సమావేశానికి హాజరైన రాహుల్‌గాంధీ సైతం అసలు ఈ భేటీనే జరిపి ఉండకూడదంటూ తన అసమ్మతిని లిఖిత పూర్వకంగా తెలిపారు. ఆ పిటిషన్లపై సుప్రీంలో బుధవారమే విచారణ జరగనున్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తుచేశారు.
కాగా, ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ పదవీకాలం మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఆయనకు వీడ్కోలు పలికింది. రాజీవ్ కుమార్ 2020 సెప్టెంబరు 1 న కేంద్ర ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్‌గా చేరారు. 2022 మే 15న దేశ 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
More Stories
వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞాన్‌పీఠ్ అవార్డు
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
నాగ్‌పుర్ హింస వెనుక బంగ్లాదేశ్ హస్తం?