మూడురోజుల పాటు తిరుపతిలో టెంపుల్ ఎక్స్‌పో

మూడురోజుల పాటు తిరుపతిలో టెంపుల్ ఎక్స్‌పో
దేవాలయ పరిపాలన, నిర్వహణకు అంకితమైన ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశం ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో (ఐటీసీఎక్స్) 17 నుంచి 19 వరకు తిరుపతిలోని ఆశా కన్వెన్షన్స్ లో జరగనుంది. టెంపుల్ ఎక్స్‌పో కాన్ఫరెన్స్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రారంభించనున్నారు. 

ఎక్స్‌పోలో భాగంగా ఆలయాలపై నిపుణుల మధ్య చర్చలు, వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నారు. టెంపుల్ కనెక్ట్ వ్యవస్థాపకుడు గిరేష్ కులకర్ణి మానసపుత్రిక అయినా ఐటీసీఎక్స్-2025, అంత్యోదయ ప్రతిష్ఠాన్ సహకారంతో నిర్వహించబోయే కార్యక్రమంతో ప్రపంచవ్యాప్తంగా దేవాలయ పర్యావరణ వ్యవస్థలను నెట్ వర్క్ చేయడానికి, బలోపేతం చేయడానికి, ఆధునీకరించడానికి ఒక డైనమిక్ వేదికను అందించడంతో పాటు, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని వేడుకగా నిర్వహించనుంది.

దాదాపు 58 దేశాల్లో సుమారు 1581 భక్తి సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గిరేష్ కులకర్ణి మాట్లాడుతూ  ఐటీసీఎక్స్ అనేది కేవలం ఒక కార్యక్రమంకంటే ఎక్కువని చెప్పారు.ఇది ఆవిష్కరణ, సస్టైనబిలిటీ ద్వారా ఆలయ పర్యావరణ వ్యవస్థలను విప్లవాత్మకంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యమమని తెలిపారు.

భారత దేశం భక్తి, ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రపంచ కేంద్రంగా ఉద్భవించినందున, వాటిని భవిష్యత్తుకు సిద్ధం చేయడానికి ఆలయ కార్యకలాపాలను నిర్వహించడం, శక్తివంతం చేయడం, క్రమబద్ధీకరించడం అవసరమని ఆయన సూచించారు. స్మార్ట్ మేనేజ్ మెంట్ వ్యూహాలను అమలు చేయడం ద్వారా, అవి ఆధ్యాత్మికత, సంప్రదాయం, సమాజాభివృద్ధికి శక్తివంతమైన కేంద్రాలుగా ఉండేలా చూసుకోవచ్చని తెలిపారు.

ఐటీసీఎక్స్ చైర్మన్, మహారాష్ట్ర శాసనమండలి చీఫ్ విప్ ప్రసాద్ లాడ్ మాట్లాడుతూ భారతదేశపు సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడాలనే ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా ఐటీసీఎక్స్ సంప్రదాయం, ఆధునిక పాలన మధ్య అంతరాన్ని తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.

దేవాలయాలు ప్రార్థనా స్థలాల కంటే ఎక్కువని, అవి సాంస్కృతిక, ఆర్థిక శక్తి కేంద్రాలని స్పష్టం చేశారు. ప్రతి ప్రార్థనా స్థలం ఎంత చిన్నదైనా, సుదూరమైనా, వాటి మతపరమైన, సాంస్కృతిక, ఆర్థిక ప్రాముఖ్యతను పెంచే ప్రపంచస్థాయి పాలన నమూనాలను పొందటానికి అర్హత కలిగి ఉన్నాయని గట్టిగా విశ్వసిస్తున్నామని ఆయన వివరించారు.

ఆలయాల వారసత్వాన్ని కాపాడుతూ సామర్థ్యాన్ని పెంచడానికి అవసరమైన సాధనాలను ఐటీసీఎక్స్ నిర్వాహకులు, విధాన రూపకర్తలకు అందిస్తుందని తెలిపారు. ఐటీసీఎక్స్ కోక్యూరేటర్ అండ్ ఐపీ డైరెక్టర్, ఫియర్స్ వెంచర్స్ వ్యవస్థాపకురాలు,  సీఈవొ మేఘా ఘోష్ మాట్లాడుతూ ఐటీసీఎక్స్ 2025 అభ్యాసం, సహకారాన్ని పెంచడానికి రూపొందించబడిన వినూత్నమైన మూడు దశల ఫార్మాట్ ను కలిగి ఉందని తెలిపారు.