
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత, బిజెపి కొన్ని రాష్ట్ర శాఖలలో తలెత్తిన గందరగోళాన్ని పరిష్కరించడంపై దృష్టి సారించింది. ఆయా రాష్ట్రాల్లో పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ముగ్గురు సీనియర్ నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీలో క్రమశిక్షణ విషయంలో రాజీలేని వైఖరి అవలంభించాలనే బిజెపి కేంద్ర నాయకత్వం భావనను ఈ చర్యలు బలోపేతం చేస్తున్నాయి.
హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల విజయాల తర్వాత, బిజెపి ప్రస్తుత చర్య కేంద్ర నాయకత్వం కీలక పదవులకు నియమించిన కొందరు రాష్ట్ర స్థాయి నాయకులను నిరంతరం సవాలు చేస్తున్న నాయకులను ఈ నోటీసులు హెచ్చరికలు పంపినట్లయినది. “ఎన్డీఏ మిత్రపక్షాలు (జాతీయ స్థాయిలో) ప్రభుత్వంతో దృఢంగా నిలుస్తున్నాయి. ఎటువంటి సవాలు లేదు. అసెంబ్లీ ఎన్నికలలో విజయాలు పార్టీపై ప్రజల అవగాహనను బలపరుస్తుండడంతో పాటు ప్రతిపక్షాలను నిరాశపరుస్తున్నాయి” అని ఓ పార్టీ నేత చెప్పారు.
సోమవారం, బిజెపి కేంద్ర క్రమశిక్షణా కమిటీ కర్ణాటకలోని బీజాపూర్ నగర ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ యత్నాల్ కు రెండవ నోటీసు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు బి ఎస్ యెడియూరప్ప కుమారుడు, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బి వై విజయేంద్రలపై ఆయన నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నందుకు ఈ నోటీసును జారీ చేశారు.
2023 నవంబర్ లో కర్ణాటక బిజెపి అధ్యక్షునిగా విజయేంద్ర నియమితులైనప్పటి నుండి, గత ఏడాది డిసెంబర్ లో ఈ అంశంపై షోకాజ్ నోటీసు కూడా అందిన యత్నాల్ ఆయనను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం షోకాజ్ నోటీసు అందిన మరో బిజెపి నాయకుడు హర్యానా మంత్రి, ఏడు సార్లు ఎమ్మెల్యే అనిల్ విజ్. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలి, హర్యానా సిఎం నయాబ్ సింగ్ సైనీలపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసును విజ్ కు బడోలి జారీ చేశారు.
పొరుగున ఉన్న రాజస్థాన్ లో కూడా, భజన్ లాల్ శర్మ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తన ఫోన్లను ట్యాప్ చేసిందనే ఆరోపణలు చేయడంతో సీనియర్ మంత్రి కిరోడి లాల్ మీనాకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు మదన్ రాథోడ్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. 2024 అక్టోబర్‌లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజ్ ముఖ్యమంత్రి పదవి కోసం డిమాండ్ చేశారు. వారం క్రితం తనపై “అంతర్గత విధ్వంసం” అని ప్రయోగించి దుమారం రేపారు.
రాజస్థాన్‌లో మీనా చాలా కాలంగా సంచలన వాఖ్యలు చేస్తున్నారు. ఆయన మంత్రివర్గానికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను ఆమోదించలేదు. బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం, కర్ణాటక అంశం సంక్లిష్టంగా మారింది. విజయేంద్రపై “అవినీతిపరుడు, వ్యక్తిత్వం లేనివాడు” అని కూడా విమర్శాలు చేశారు. యాత్నాల్ శిబిరానికి చెందిన మరో ఎమ్మెల్యే రమేష్ జార్కిహోళి రాష్ట్ర అధ్యక్షుడిని “బచ్చా (పిల్లవాడు)” అని అభివర్ణించారు.
కరోనా మహమ్మారి సమయంలో మాజీ ముఖ్యమంత్రి రూ.40,000 కోట్ల కుంభకోణంలో పాల్గొన్నారని ఆరోపించిన 2023 నవంబర్‌లో యత్నాల్ విజయేంద్ర, యదియూరప్పలపై విమర్శలు చేయడం ప్రారంభించినప్పటికీ, జూన్ 2024 తర్వాత పార్టీ నాయకుల నుండి ప్రతికూల వ్యాఖ్యలు పెరుగుతున్నాయనే అభిప్రాయం ఉంది.
2014లో నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానమంత్రి అయినప్పటి నుండి బిజెపి చాలావరకు క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఢిల్లీ, మణిపూర్ కొత్త సీఎంల ఎంపికతో పాటు పార్టీ శ్రేణులు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో పార్టీలో క్రమశిక్షణా చర్యలపై నాయకత్వం దృష్టి సారించడం ప్రాధాన్యతను సంతరింప చేసుకుంటున్నది.
More Stories
పాకిస్థాన్ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్
తమిళనాడులో రూ.1000 కోట్ల లిక్కర్ స్కామ్!
15 నెలల్లో తెలంగాణ ప్రభుత్వ అప్పు రూ. రూ. 1.52 లక్షల కోట్లు